రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ Anganwadi జాబ్..33 జిల్లాలలో 3100 టీచర్లు, 12,882 సహాయక ఉద్యోగులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.. అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు

రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ Anganwadi జాబ్..33 జిల్లాలలో 3100 టీచర్లు, 12,882 సహాయక ఉద్యోగులకు జిల్లాల వారీగా నోటిఫికేషన్ జారీ.. అప్లై చేసుకోవడానికి కావలసిన డాక్యుమెంట్ వివరాలు

Telangana Anganwadi AWT & Anganwadi AWH Recruitment 2026 Apply Now: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 15,982 ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. కొత్త గా మరో జిల్లాలో ఐసిడిసి ప్రాజెక్టు వారి ఖాళీలు గుర్తింపు శిశు సంక్షేమ శాఖ భర్తీ నోటిఫికేషన్ జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు. ఇందులో 3,100 పోస్టులు టీచర్లు, 12,882 పోస్టులు సహాయక ఉద్యోగులకు నోటిఫికేషన్ విడుదల కానున్నాయి. ఈ రోజులు మరో జిల్లాలో దరఖాస్తుల ప్రారంభతేదీ: 27.06.2026. దరఖాస్తుల చివరి తేదీ: 10.07.2026 సాయంత్రం 5.00 గంటల వరకు అభ్యర్థులు పూర్తి వివరాల కోసం wdcw.tg.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు.

నల్లగొండ జిల్లా పరిధిలోని (9) ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఆనుముల, చింతపల్లి, దామర్చర్ల, దేవరకొండ, కొండమల్లే పల్లి, | మిర్యాలగూడ (U), మునుగోడు, నకిరేకల్ మరియు నల్లగొండ ఐసీడీఎస్ ప్రాజెక్టులలో ఖాళీగా ఉన్న ఆంగన్వాడీ టీచర్ (AWT) మరియు ఆంగన్వాడీ హెల్పర్ (AWH) పోస్టులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం మొదటి విడతలో భర్తీ చేయుటకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించనైనది.

అభ్యర్థులు పూర్తి వివరాల కోసం wdcw.tg.nic.in వెబ్సైట్ను సందర్శించవచ్చు. ముఖ్యమైన తేదీలు దరఖాస్తుల ప్రారంభతేదీ: 27.06.2026. దరఖాస్తుల చివరి తేదీ: 10.07.2026 సాయంత్రం 5.00 గంటల వరకు ముఖ్య నిబంధనలు మరియు అర్హతలు.

విద్యార్హత అంగన్వాడీ టీచర్ పోస్టులకు అభ్యర్థులు తప్పనిసరిగా ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. గిరిజన ప్రాంతాలలో అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో, ఎస్ఎస్సి 10వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులను పరిగణలోనికి తీసుకుంటారు. వయస్సు, అభ్యర్థుల వయస్సు 18 సం||రాల నుండి 35 సం||రాల మధ్య ఉండాలి. స్థానికత అభ్యర్థి సంబంధిత అంగన్వాడీ కేంద్ర పరిధికి/ వార్డ్ (ఆర్బన్ ఏరియాలలో) గ్రామపంచాయతికి (రూరల్) చెందిన స్థానికురాలు అయి ఉండాలీ.

జిల్లాల వారీగా ఖాళీ వివరాలు

జిల్లా              –   టీచర్లు  –  సహాయకులు
•ఆసిఫాబాద్    – 182       – 452
•మంచిర్యాల    – 110      – 398
•పెద్దపల్లి          – 56         – 252 – Open
•భూపాలపల్లి   -50          – 133
•ములుగు        -95          – 319
•నిర్మల్              – 80        – 435
•ఆదిలాబాద్     -176       – 628
•నిజామాబాద్    – 80       – 601
•జగిత్యాల         – 70       – 352
•కరీంనగర్         -56        – 230
•సిరిసిల్ల            – 57       – 181
•సిద్దిపేట            -84       – 271
•కామారెడ్డి         – 106      – 445
•మెదక్              – 63       – 345
•కొత్తగూడెం        – 192     – 1,033
•ఖమ్మం              -136      – 655
•మహబూబాబాద్ – 116       – 478
•వరంగల్               – 63         – 289
•హనుమకొండ        – 71         – 240
•సూర్యాపేట           – 84          – 321
•నల్గొండ                 – 148       – 688 – Open
•జనగామ                – 27        – 187
•యాదాద్రి భువనగిరి -62        – 270
•మేడ్చల్                  – 64        – 227
•హైదరాబాద్            – 183      – 402
•రంగారెడ్డి                 – 137      – 611
•సంగారెడ్డి                 – 80        – 416
•వికారాబాద్              – 94        – 399
•మహబూబ్నగర్        – 62        – 364- Open
•గద్వాల                     – 65       – 308
•వనపర్తి                      – 47       – 203
•నారాయణ పేట        – 32        – 196
•నాగర్కర్నూల్             – 162     – 553

ఎంపిక విధానం

1. అంగన్వాడీ టీచర్ మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్టులకు, అభ్యర్థి తప్పనిసరిగా స్థానిక మహిళ అయి ఉండాలి. పట్టణ ప్రాంతాలలో అయితే ఆ వార్డు నివాసి అయి ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో అయితే అంగన్వాడీ కేంద్రం పరిధిలో నివాసి అయి ఉండాలి.

2. ఎస్టీ సబ్ ప్లాన్ క్రింద ఎస్టీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు అంగన్వాడీ హెల్పర్ పోస్టులకు, అదే కుగ్రామం/ఆవాసం నుండి వచ్చిన ఎస్టీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.

3. ఎస్సీ సబ్ ప్లాన్ క్రింద ఎస్సీ వర్గానికి కేటాయించిన అంగన్వాడీ టీచర్ మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్టులకు, అదే గ్రామ పంచాయతీలోని ఆవాసం నుండి వచ్చిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.

అభ్యర్థుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది: ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ 70 మార్కులు, ప్రత్యేక కేటగిరీలు, వితంతువులు- 10 మార్కులు, అనాథలు-5 మార్కులు, దివ్యాంగులు 5 మార్కులు. జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ 10 మార్కులు, దరఖాస్తు wdcw.tg.nic.in వెబ్సైట్ నందు మాత్రమే చేయవలెను.

అంగన్వాడి ఉద్యోగులకు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు కావలసిన డాక్యుమెంట్ వివరాలు

Residence Certificate

•10th Certificate

•Certificate of Highest Qualification

•క్రీడల సర్టిఫికేట్

•If Widow?

•If Orphan

•If Differently abled

•Caste Certificalle

•Intor Certificate

•Certificate of Ex servicemen

•Certificate of EWS

(ఫైల్ పరిమాణం 100KB కంటే తక్కువగా ఉండాలి).

🛑New Notification Pdf Click Here

🛑 Education Qualification & Guidelines Click Here

🛑Online Apply Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *