India Post GDS Correction Window 2026: 10th అర్హతతో పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు.. సెప్టెంబర్ 23, 24 తేదీలు సవరణ విండో
India Post GDS Correction Window 2026 : India Post GDS 2026 దరఖాస్తు సవరణకు అవకాశం కల్పించింది. సెప్టెంబర్ 23, 24 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకు వివరాలు సరిచేసుకోవచ్చు.
ఇండియా పోస్ట్ గ్రామీణ డాక్ సేవక్ (GDS) 2026 నియామకానికి దరఖాస్తు చేసిన అభ్యర్థులకు ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. దరఖాస్తులో ఏమైనా తప్పులు ఉంటే సరిచేసుకునేందుకు ప్రత్యేక కరెక్షన్ విండోను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ సవరణ అవకాశం సెప్టెంబర్ 23, 24 తేదీల్లో మాత్రమే ఉంటుంది. అభ్యర్థులు ఈ రెండు రోజుల్లోనే తమ దరఖాస్తును పరిశీలించి అవసరమైన మార్పులు చేసుకోవాలి. కరెక్షన్ విండో సెప్టెంబర్ 24న సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది.

ఏ పోస్టులకు దరఖాస్తు చేశారు : ఈ నియామకంలో బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (BPM), అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ (ABPM), డాక్ సేవక్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే దరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ వివరాలను మరోసారి చెక్ చేసుకుని, అవసరమైతే సవరణలు చేసుకోవచ్చు.
అర్హతలు ఇవే : GDS పోస్టులకు సాధారణంగా 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి. టెన్త్‌లో మ్యాథ్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు చదివి ఉండాలి. సంబంధిత పోస్టల్ సర్కిల్‌కు అవసరమైన స్థానిక భాషపై కూడా పరిజ్ఞానం ఉండాలి. అదేవిధంగా కంప్యూటర్ పరిజ్ఞానం, సైక్లింగ్ తెలిసి ఉండటం అవసరం. టెన్త్ మార్కుల ఆధారంగానే ఎంపిక GDS పోస్టులకు ప్రత్యేక రాత పరీక్ష నిర్వహించకుండా 10వ తరగతి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా రూపొందిస్తారు. మెరిట్లో చోటు దక్కిన అభ్యర్థులకు తదుపరి దశలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అర్హతలు, పత్రాల పరిశీలన పూర్తైన తర్వాత నియామక ప్రక్రియ కొనసాగుతుంది.
జీతం ఎంత : బ్రాంచ్ పోస్ట్‌మాస్టర్ పోస్టుకు నెలవారీ అలవెన్స్ రూ.12,000 నుంచి రూ.29,380 వరకు ఉంటుంది. ABPM, డాక్ సేవక్ పోస్టులకు రూ.10,000 నుంచి రూ.24,470 వరకు అలవెన్స్ లభిస్తుంది.
కరెక్షన్ చేసుకునే ముందు జాగ్రత్త సెప్టెంబర్ 23, 24 తేదీల్లో అధికారిక పోర్టల్‌లోకి లాగిన్ అయి దరఖాస్తులోని వివరాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పేరు, విద్యార్హతలు, ఇతర వివరాల్లో ఏమైనా తప్పులు ఉంటే అందుబాటులో ఉన్న సవరణ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి.
సెప్టెంబర్ 24 సాయంత్రం 5 గంటల తర్వాత కరెక్షన్ విండో ముగియనుంది. కాబట్టి చివరి రోజు వరకు వేచి ఉండకుండా వీలైనంత త్వరగా దరఖాస్తును చెక్ చేసుకోవడం మంచిది.

🛑India Post GDS Correction Window 2026 Direct Link

