Cheyutha Pensions : 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Telangana Cheyutha Pensions 4.5 Lakh New Beneficiaries : తెలంగాణ రాష్ట్రంలో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారికి ప్రభుత్వం శుభవార్త అందించింది. కొత్తగా 4.5 లక్షల మందికి చేయూత పింఛన్లు మంజూరు చేసింది. దీపావళి కానుకగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆదివారం కొడంగల్ పర్యటనలో భాగంగా హకీంపేటలో నిర్వహించిన మహిళా సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి లబ్ధిదారులకు పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా కొత్తగా మంజూరైన పింఛన్ల పంపిణీని అధికారికంగా ప్రారంభించారు.
కొత్తగా మంజూరైన 4.5 లక్షల పింఛన్లలో మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత లభించింది. మొత్తం లబ్ధిదారుల్లో సుమారు 3.5 లక్షల మంది మహిళలు ఉన్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. దీంతో అర్హత కలిగిన మరికొంతమంది మహిళలకు పింఛన్ ప్రయోజనం అందనుంది.
ఈ పింఛన్ మంజూరు పత్రాలను తెలంగాణలోని అన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధుల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. సంబంధిత జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని కొనసాగించనున్నారు.
కొత్తగా పింఛన్లు మంజూరైన లబ్ధిదారులు తమకు సంబంధించిన పింఛన్ మంజూరు పత్రాలను స్థానిక ప్రజాప్రతినిధులు లేదా సంబంధిత అధికారుల ద్వారా పొందవచ్చు. తెలంగాణలో 4.5 లక్షల మందికి కొత్తగా చేయూత పింఛన్లు మంజూరు. దీపావళి కానుకగా సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ ప్రారంభించారు. వీరిలో 3.5 లక్షల మంది మహిళలు ఉన్నారు.


