ఆశా కార్యకర్తల ఉద్యోగాలు 2026: మహిళలకు అవకాశం.. అర్హతలు, మార్కులు, దరఖాస్తు వివరాలు ఇవే | Asha Worker Jobs

ఆశా కార్యకర్తల ఉద్యోగాలు 2026: మహిళలకు అవకాశం.. అర్హతలు, మార్కులు, దరఖాస్తు వివరాలు ఇవే | Asha Worker Jobs

Asha Worker Recruitment 2026 Eligibility Application Details: ఆశా కార్యకర్తల ఖాళీల భర్తీకి మహిళల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. అర్హతలు, వయసు, కావాల్సిన ధ్రువపత్రాలు, ఎంపిక విధానం, మార్కుల వివరాలు తెలుసుకోండి.

మహిళలకు ఉద్యోగ అవకాశం కల్పించేలా ఆశా కార్యకర్తల ఖాళీల భర్తీకి నియామక ప్రకటన విడుదలైంది. స్వర్ణ గ్రామం (సచివాలయం) వార్డు పరిధిలోని అర్హత కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత గ్రామ/వార్డు సచివాలయం పరిధిలోని PHC/UPHC మెడికల్ ఆఫీసర్‌కు తమ దరఖాస్తులను సమర్పించాలి.

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు : ఆశా కార్యకర్త పోస్టుకు దరఖాస్తు చేసుకునే మహిళ తప్పనిసరిగా 10వ తరగతి సర్టిఫికెట్, సంబంధిత గ్రామం లేదా వార్డు సచివాలయం పరిధిలో నివసిస్తూ ఉండాలి. అభ్యర్థి వయసు 25 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి. అలాగే వివాహిత మహిళ అయి ఉండటం తప్పనిసరి.
వితంతువులు, విడాకులు పొందిన మహిళలు, భర్త నుంచి విడిపోయిన వారు, నిరాశ్రయ మహిళలకు ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

అభ్యర్థికి తెలుగు భాషను బాగా చదవడం, రాయడం వచ్చి ఉండాలి. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీల ఆరోగ్యం, పోషకాహారం వంటి అంశాలపై అవగాహనతో పాటు ఇతరులకు విషయాలను స్పష్టంగా వివరించే సామర్థ్యం ఉండాలి.

ప్రజలతో కలిసి పనిచేయడం, సమస్యలను పరిష్కరించేందుకు చొరవ చూపడం, నాయకత్వ లక్షణాలు, సానుకూల దృక్పథం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన లేదా ప్రస్తుతం పనిచేస్తున్న మహిళలకు కూడా ప్రాధాన్యత ఇవ్వనున్నారు.

దరఖాస్తుతో ఏ పత్రాలు ఇవ్వాలి : అభ్యర్థులు దరఖాస్తుతో పాటు నివాస ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ఇందుకోసం తహసీల్దార్ జారీ చేసిన నివాస ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, BPL కార్డు, ఓటర్ కార్డు, ఆధార్ కార్డు లేదా బ్యాంక్ పాస్‌బుక్ వంటి పత్రాలను అందజేయవచ్చు.

అదేవిధంగా 10వ తరగతి సర్టిఫికెట్ కాపీ తప్పనిసరిగా జత చేయాలి. ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలో పనిచేసిన అనుభవం ఉంటే దానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఇవ్వాలి. అభ్యర్థికి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటే, వారి వయసుకు అనుగుణంగా అవసరమైన టీకాలు పూర్తిగా వేయించినట్లు చూపించే ధ్రువపత్రం లేదా మాతా శిశు సంరక్షణ కార్డు కాపీని సమర్పించాలి. వితంతువు, విడాకులు పొందిన, భర్త నుంచి విడిపోయిన లేదా నిరాశ్రయ మహిళ అయితే, సంబంధిత వైవాహిక స్థితికి సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఎంపిక ఎలా ఉంటుంది : ఆశా కార్యకర్తల ఎంపికకు మొత్తం 100 మార్కులు కేటాయించారు. విద్యార్హతకు గరిష్ఠంగా 20 మార్కులు, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసిన అనుభవానికి 20 మార్కులు, వైవాహిక స్థితికి 10 మార్కులు, పిల్లల ఇమ్మునైజేషన్‌కు 10 మార్కులు, ఇంటర్వ్యూకు 40 మార్కులు కేటాయించారు. 10వ తరగతిలో ఫస్ట్ క్లాస్‌లో ఉత్తీర్ణులైన వారికి 20 మార్కులు, సెకండ్ క్లాస్‌కు 10 మార్కులు, థర్డ్ క్లాస్‌కు 5 మార్కులు ఇస్తారు. స్వచ్ఛంద సంస్థల్లో ఐదేళ్లకు పైగా పనిచేసిన వారికి 20 మార్కులు, ఒకటి నుంచి ఐదేళ్ల అనుభవం ఉన్నవారికి 10 మార్కులు, ఒక సంవత్సరం కంటే తక్కువ అనుభవం ఉన్నవారికి 5 మార్కులు కేటాయిస్తారు. వితంతువు, విడాకులు పొందిన, భర్త నుంచి విడిపోయిన లేదా నిరాశ్రయ మహిళలకు వైవాహిక స్థితి కింద 10 మార్కులు కేటాయిస్తారు. ఐదేళ్లలోపు పిల్లలు ఉండి, వారికి వయసుకు తగిన పూర్తి టీకాలు వేయించినట్లయితే మరో 10 మార్కులు లభిస్తాయి.

ఇంటర్వ్యూలో 40 మార్కులు :ఇంటర్వ్యూకు మొత్తం 40 మార్కులు ఉంటాయి. ఇందులో తెలుగు చదవడం, రాయడం వంటి అంశాలకు 20 మార్కులు కేటాయించారు. ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యం, పోషకాహార లోపం వంటి అంశాలపై అవగాహనకు 10 మార్కులు ఉంటాయి.

దరఖాస్తు ఎక్కడ ఇవ్వాలి : అర్హత ఉన్న మహిళా అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న గడువులోపు తమ దరఖాస్తులను సంబంధిత PHC/UPHC మెడికల్ ఆఫీసర్ వద్ద సమర్పించాలి. దరఖాస్తు ఇచ్చిన తర్వాత తప్పనిసరిగా రశీదు తీసుకోవాలి. నిర్ణీత గడువు ముగిసిన తర్వాత వచ్చే దరఖాస్తులను స్వీకరించరు.

🛑Notification Pdf Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *