TG TET Results 2026 : ఎల్లుండి ఫలితాలు.. ఉదయం 11 గంటలకు విడుదల
TG TET Results 2026 September 26 | TG TET Results 2026 Date : తెలంగాణలో ఇన్-సర్వీస్ టీచర్లకు నిర్వహించిన టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TG TET) ఫలితాలు సెప్టెంబర్ 26న విడుదల కానున్నాయి. ఉదయం 11 గంటలకు ఫలితాలను విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.
ఈ పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫలితాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను https://tgtet.aptonline.in/ సందర్శించవచ్చు. అక్కడ తమ హాల్ టికెట్ లేదా ఇతర అవసరమైన వివరాలను నమోదు చేసి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.

ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ఈ నెల 8, 9 తేదీల్లో TG TET పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్షకు 24 వేల మందికిపైగా సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు హాజరైనట్లు సమాచారం.
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులు తప్పనిసరిగా TET అర్హత సాధించాలనే అంశంపై సుప్రీంకోర్టు గతంలో స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో ఈ పరీక్షకు ప్రాధాన్యం ఏర్పడింది. దీంతో ఫలితాల కోసం అభ్యర్థులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఫలితాలు ఎలా చెక్ చేసుకోవాలి?
TG TET ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు అధికారిక TG TET వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. Results విభాగాన్ని ఎంచుకుని అడిగిన వివరాలను నమోదు చేస్తే స్కోర్‌కార్డ్‌ను చూడవచ్చు. ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకుని భవిష్యత్ అవసరాల కోసం భద్రపరచుకోవడం మంచిది.

TG TET ఫలితాలు సెప్టెంబర్ 26న ఉదయం 11 గంటలకు విడుదల కానున్నందున అభ్యర్థులు https://tgtet.aptonline.in/ అధికారిక వెబ్‌సైట్‌ను గమనిస్తూ ఉండాలి.

