కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు రేపే జీతాలు
Bank Strike September Salary Pension Advance Payment 2026 : బ్యాంకుల సమ్మె నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ మొత్తాలను ముందుగానే చెల్లించేందుకు అనుమతి ఇచ్చింది.
సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకుల సమ్మె జరగనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్ డబ్బులు సెప్టెంబర్ 25నే వారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి.
ఈ ముందస్తు చెల్లింపులు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షనర్లకు వర్తిస్తాయి. అలాగే డిఫెన్స్, పోస్టల్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు కూడా ఈ అవకాశం వర్తించనుంది.
కేంద్రం అనుమతించిన ఈ మొత్తాన్ని అడ్వాన్స్ పేమెంట్గా పరిగణిస్తారు. సంబంధిత లెక్కలు పూర్తిగా ఖరారైన తర్వాత అక్టోబర్ నెల చెల్లింపుల్లో అవసరమైన మొత్తాన్ని సర్దుబాటు చేయనున్నట్లు వెల్లడించింది.
అంటే బ్యాంకుల సమ్మె కారణంగా జీతాలు, పెన్షన్ల చెల్లింపుల్లో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే సెప్టెంబర్ నెల మొత్తాన్ని చెల్లించేలా కేంద్రం చర్యలు తీసుకుంది.

