​Anganwadi Jobs 2025 : No Fee 10th అర్హత తో సులువుగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

Anganwadi Jobs 2025 : No Fee 10th అర్హత తో సులువుగా అంగన్వాడీ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

AP Anganwadi Recruitment 2025, Apply Online, district wise Wise Notification, and Eligibility Details

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Job Recruitment 2025 : ​ ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగ మహిళలకు శుభవార్త.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో పాడేరు, చింతూరు, రంపచోడవరం డివిజనలో అంగన్వాడీ కేంద్రములలో 114 ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ 7 పోస్టులు, ఆయాలు 56 పోస్టులు, మినీ అంగన్వాడీ టీచర్ 27 పోస్టులు, పియం జన్ మన్ స్కీంలో కొత్త గా మంజురైన అంగన్వాడీ కేంద్రములలో ఆయాలు 24 పోస్టుల భర్తీకి అర్హులైన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎ ఎస్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.

పదో తరగతి పాసైన మహిళా అభ్యర్థుల నుంచి ఈ నెల 2025 మార్చ్ 26 నుండి ఏప్రిల్ 10వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారికి నేరుగా గాని పోస్ట్ ద్వారా గాని దరఖాస్తులు సమర్పించాలని కలెక్టర్ తెలిపారు.

అంగన్వాడీ ఖాళీలు:

• అంగన్వాడీ టీచర్: 7​
• అంగన్వాడీ ఆయాలు: 56​
• మినీ అంగన్వాడీ టీచర్: 27
• పీఎం జన్ మన్ పథకంలో కొత్తగా మంజూరైన అంగన్వాడీ కేంద్రాలలో ఆయాలు: 24​ వివిధ ప్రాంతాలలో ఖాళీలతో ఉన్నాయి.

అంగన్వాడీఅర్హతలు:

• విద్యార్హత: పదో తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి.​ స్థానికంగా నివాసం ఉండే వివాహిత మహిళలు మాత్రమే దరఖాస్తు చేయగలరు.​

• వయో పరిమితి: 2025 జూలై 1 నాటికి 21 నుండి 35 సంవత్సరాల మధ్య వయస్సు ఉండాలి. 21 సంవత్సరాల అభ్యర్థులు లభించని పక్షంలో, 18 సంవత్సరాలు నిండిన అభ్యర్థుల దరఖాస్తులు పరిగణనలోకి తీసుకుంటారు.​

అంగన్వాడీ దరఖాస్తు విధానం: అర్హులైన అభ్యర్థులు 2025 మార్చి 26 నుండి ఏప్రిల్ 10 సాయంత్రం 5 గంటల లోపు సంబంధిత శిశు అభివృద్ధి పథకం అధికారికి స్వయంగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తులు సమర్పించాలి.​

అంగన్వాడీ ఎంపిక ప్రక్రియ:

• పదో తరగతి మార్కులు: 50 మార్కులు​
• ప్రీ-స్కూల్ టీచర్ ట్రైనింగ్/క్రిషి/ప్రీ-స్కూల్ మేనేజ్‌మెంట్ ట్రైనింగ్ సర్టిఫికేట్: 5 మార్కులు​
• వితంతువులకు: 5 మార్కులు​
• మైనర్ పిల్లలతో ఉన్న వితంతువులకు: 5 మార్కులు​
• పూర్తి అనాథ, క్రెచ్ హోమ్, ప్రభుత్వ సంస్థలలో నివసించే వారికి: 10 మార్కులు​
• అర్హత కలిగిన వికలాంగులకు: 5 మార్కులు​
• మౌఖిక పరీక్ష: 20 మార్కులు​
ఎటువంటి రాత పరీక్ష లేకుండా మొత్తం 100 మార్కుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా నిర్వహించబడుతుంది. అభ్యర్థులు మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని జిల్లా కలెక్టర్ హెచ్చరిస్తున్నారు.​

అంగన్వాడీ ముఖ్యమైన తేదీలు:

• దరఖాస్తు ప్రారంభం: 2025 మార్చి 26​
• దరఖాస్తు ముగింపు: 2025 ఏప్రిల్ 10 సాయంత్రం 5 గంటల లోపు​ పూర్తి వివరాల కోసం సంబంధిత ఐసీడీఎస్ కార్యాలయాలను సంప్రదించండి.

🛑District Wise Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🔥12th అర్హతతో సచివాలయ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | CSIR NEERI Junior Secretariat Assistant and Junior Stenographer

🔥10+2 అర్హతతో అసిస్టెంట్ లైబ్రేరియన్ & ఆఫీస్ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ | NITG Assistant Librarian & Attender Notification 2025

🔥10th అర్హతతో తెలంగాణలో బస్తీ దవాఖానాలలో సపోర్టింగ్ స్టాఫ్ జాబ్స్ | NHM Supporting staff Notification 2025 Apply Now

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *