Talliki Vandanam : మరో BIG UPDATE..అంగన్వాడీ కార్యకర్తల, శానిటేషన్ వర్కర్ల పిల్లలకూడా.. రూ.13,000.. జులై 22న ఖాతాల్లోకి..
Talliki Vandanam Scheme 2026 Anganwadi workers, sanitation workers fund release : ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 22న తల్లికి వందనం నిధులు విడుదల చేస్తున్నారని శుభవార్త తెలియజేశారు. ఈ సంవత్సరం దాదాపుగా 17వేల మంది అంగన్వాడీ కార్యకర్తల పిల్లలకు (1st క్లాస్ to ఇంటర్మీడియట్ వరకు) ఈ పథకం వర్తిస్తుందని తెలిపారు. వీరి అకౌంట్లో 13 చొప్పున జమ చేయనున్నది. అలాగే శానిటేషన్ వర్కర్ల పిల్లలకు కూడా అందిస్తుంది. గత సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగుల నిబంధనల వల్ల వీరికి ఈ అవకాశం ఉండేది కాదు.

ఆంధ్రప్రదేశ్ లో విద్యా హక్కు (RTE) చట్టం కింద ప్రైవేట్ స్కూళ్లలో ఫ్రీ సీట్లు పొందిన 1,04,046 మంది విద్యార్థులకు తల్లికి వందనం స్కీము వర్తిస్తుంది. అయితే 13,000 పూర్తిగా రావు. ఆయా పాఠశాల ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు మినహాయించి మిగతా డబ్బులు లబ్ధిదారులు ఖాతాల్లో జమ చేయనున్నారు. అలాగే ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు పొందుతున్న విద్యార్థులకు ఈ మొత్తాన్ని మినహాయిస్తుంది.

తల్లికి వందనం స్కీం కింద రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు ఒక్కొక్క విద్యార్థికి 13 వేల చొప్పున తల్లుల అకౌంట్లో డబ్బులు చెమకానున్నాయి.

