Passport Slot Booking: ఈనెల 18 నుంచి 01 ఆగస్టు తేదీ వరకు POPSK స్పెషల్ డ్రైవ్
AP POPSKs Passport slot booking, rescheduling 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 18వ తేదీ నుంచి ఆగష్టు 1వ తేదీ వరకు పాస్ పోర్ట్ స్లాట్ బుకింగ్, రీ-షెడ్యూల్ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుంది.

ఆంధ్రప్రదేశ్ లో పోస్టల్ సర్కిల్ పరిధిలో పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం (POPSKs) జూలై 18వ తేదీ నుంచి ఒకటి ఆగస్టు తేదీలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా పాస్ పోర్ట్ స్లాట్ బుకింగ్, రీ షెడ్యూలకు అవకాశం కల్పిస్తున్నారు. వారంలో ఐదు రోజులే పని ఈ కేంద్రం ఆయా తేదీలలో (శనివారం) కూడా పనిచేయనున్నాయి. వినియోగదారులు సౌకర్యం కోసం దీనిని ఏర్పాటు చేయాలని తపల శాఖ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్లో విజయవాడ పాస్ పోర్ట్ రీజనల్ పరిధిలో బాపట్ల, గుంటూరు, హిందూపురం ఒంగోలు, గుడివాడ, నరసరావుపేట, అనంతపురం, నెల్లూరు, కోడూరు, చిత్తూరు, కడప, నంద్యాల & కర్నూలు పరిధిలో పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. ఆయా తేదీలలో స్లాట్ ఇప్పటికీ ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి. కొత్త వారు దాని సంబంధించి వెబ్సైట్లో లాగిన్ అయ్యి కొత్త స్లాట్ లో బుకింగ్ చేసుకోవచ్చు.
కొత్తగా స్లాట్ బుకింగ్ చేసుకోవాలన్న అభ్యర్థులు వెబ్సైట్లో లాగిన్ చేసుకోవచ్చు. ఇప్పటికే బుకింగ్ చేసుకున్న వారు రీ షెడ్యూల్ చేసుకుని అవకాశం ఉంది అని తపల శాఖ వర్గాలు వెల్లడించారు.

🛑Official Website Click Here

