నిరుద్యోగులకు శుభవార్త.. 61,579 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే
TS Govt Jobs : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు శుభవార్త అందించింది. ఉగాది పండుగ తర్వాత, రాష్ట్రంలోని మహిళా శిశు సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ & విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL) శాఖల్లో ఖాళీగా ఉన్న 61,579 పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఉగాది తర్వాత నోటిఫికేషన్ విడుదల చేస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది. ఈ నోటిఫికేషన్ కేవలం 10+ITI, 12th & డిప్లమా & ఎన్ని డిగ్రీ అర్హతతో తెలంగాణ లో ఉద్యోగాలు విడుదల కానున్నాయి. ఈ నియామకాల ద్వారా నిరుద్యోగులకు అవకాశాలు పెరుగుతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రతి ఒక్కరు కూడా ప్రిపరేషన్ ఇప్పుడు నుంచి స్టార్ట్ చేయండి. ఎవరైతే మంచిగా చదువుకుంటారో వాళ్ళకి జాబ్స్ అనేది వస్తాయి.
🔥AP Ration Card : రేషన్ కార్డుదారుల ఈకేవైసీ ఈనెల 31 లోపల తప్పనిసరిగా చేయాలి

61,579 భర్తీ చేయనున్న పోస్టులు:
• అంగన్వాడీ టీచర్లు మరియు హెల్పర్లు: మహిళా శిశు సంక్షేమ శాఖలో 6,399 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 7,837 హెల్పర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హతతో వివాహమైన మహిళలు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుంటే సొంత జిల్లాలో ఉద్యోగం వస్తుంది. ఈ ఉద్యోగాలు జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన విడుదల కావడం జరుగుతుంది.
🔥Job Alert: ఉచిత శిక్షణ, వసతి, భోజనం తోపాటు ఉపాధి అవకాశాలు
• గ్రామ పరిపాలన అధికారులు (VRO): రెవెన్యూ శాఖలో 10,954 గ్రామ పరిపాలన అధికారి పోస్టులు భర్తీ చేయనున్నారు.
• ఇతర విభాగాలు: విద్యుత్ పంపిణీ సంస్థ (TGSPDCL)లో 3,200 పోస్టులు, సబ్ స్టేషన్లలో 3,200 పోస్టులు, మరియు ఇతర విభాగాల్లో 30,238 పోస్టులు భర్తీ చేయనున్నారు.

ముఖ్యాంశాలు:
• జాబ్ క్యాలెండర్: 2025-26 సంవత్సరానికి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్ సిద్ధం చేయబడింది. ప్రతి నెలలో ఏ నోటిఫికేషన్ విడుదలవుతుందో ముందస్తుగా ప్రకటించనున్నారు.
ఎంపిక విధానం: ప్రతి పోస్టుకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి వివరాలు త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లలో స్పష్టంగా పేర్కొనబడతాయి