Anganwadi Recruitment 2025 : 10th అర్హతతో నేడే 948 పోస్టులు అంగన్వాడీ నోటిఫికేషన్
AP Anganwadi Teacher & Helper Recruitment 2025 : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ మహిళలకు శుభవార్త. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా కేవలం 10వ తరగతి పాస్ అయిన మహిళ అభ్యర్థులకు సొంత జిల్లాలోనే 948 అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ నియామక ప్రక్రియను చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ పూర్తిగా జిల్లా కలెక్టర్ ఆదేశాల పైన విడుదల కావడం జరుగుతుంది. అర్హతలు జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది పూర్తిగా చదవండి.

ఈ అంగన్వాడి టీచర్ హెల్పర్ నోటిఫికేషన్ కింద భర్తీ చేయనున్న పోస్టుల సంఖ్య:
• 160 అంగన్వాడీ కార్యకర్తలు
• 60 మినీ అంగన్వాడీ కార్యకర్తలు
• 728 అంగన్వాడీ హెల్పర్లు (ఆయాలు)
మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటన మేరకు, 2025 మార్చి 22న జిల్లా కలెక్టర్లు అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నారు.
ఈ నియామక ప్రక్రియ పూర్తిగా రాత పరీక్ష లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
🔥నిరుద్యోగులకు శుభవార్త.. 61,579 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. శాఖల వారీగా లెక్కలివే
• అభ్యర్థుల ఎంపిక కోసం రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో సెలక్షన్ ఉంటుంది.
• అర్హత కలిగిన అభ్యర్థులనే ఎంపిక చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.
• రాష్ట్రంలో 139 కొత్త అంగన్వాడీ కేంద్రాలను ఆదివాసీ ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు.
• ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం ₹20.80 కోట్లు మంజూరు చేసింది.
అంగన్వాడీ టీచర్ హెల్పర్ విద్య అర్హతలు
అంగన్వాడీ ఉద్యోగాలకు విద్యార్హత కనీసం 8వ తరగతి లేదా 10వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 – 35 సంవత్సరాలు మధ్య కలిగి ఉండాలి. వివాహమై ఉండాలి సొంత గ్రామంలో లేదా వార్డులో నివసిస్తున్న మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ఆసక్తిగల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ wdcw.ap.gov.in ద్వారా లేదా జిల్లా వారిగా కలెక్టర్ ఆఫీస్ ద్వారా అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి.
అంగన్వాడి వేతనం
ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం నెల జీతం కింద విధంగా ఇవ్వడం జరిగింది.
• అంగన్వాడీ కార్యకర్తల వేతనం – ₹11,500 – ₹12,500
• మినీ అంగన్వాడీ కార్యకర్తల వేతనం – ₹9,000 – ₹11,000
• అంగన్వాడీ హెల్పర్ల వేతనం – ₹9,000 – ₹11,000
ఇవి ప్రస్తుత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉంటాయి. కొత్తగా ప్రకటించబోయే మార్పులు అధికారిక నోటిఫికేషన్‌లో తెలియజేస్తారు.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ =మార్చి 22, 2025
దరఖాస్తు ప్రారంభం = నోటిఫికేషన్ విడుదలైన వెంటనే
దరఖాస్తు చివరి తేది = త్వరలో ప్రకటించబడును
రాత పరీక్ష తేదీ = త్వరలో ప్రకటించబడును
అంగన్వాడీ ఉద్యోగాలకు కావలసిన డాక్యుమెంట్ వివరాలు
అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడం కూడా అభ్యర్థులకి కింద చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లైతే మీకు జాబ్ వచ్చినట్లయితే.
•నివాస దృవీకరణ
•పుట్టిన తేదీ లేదా (SSC Memo)
•10th Memo
•Caste సర్టిఫికెట్ (SC, ST & OBC)
•సదరం సర్టిఫికెట్ (దివ్యాంగులకు)
•అనాధ సర్టిఫికేట్ అన్ని సర్టిఫికెట్ జిరాక్స్ తీసి గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించి మీ దగ్గర రెడీ చేసి పెట్టుకోండి.

🛑Notification Pdf Click Here
🛑Anganwadi District Wise Official Website Click Here
🔥AP Ration Card : రేషన్ కార్డుదారుల ఈకేవైసీ ఈనెల 31 లోపల తప్పనిసరిగా చేయాలి
తరచుగా అడిగే ప్రశ్నలు (FAQ)
1. ఈ ఉద్యోగాలకు ఎవరెవరూ అర్హులు?
8వ తరగతి, 10వ తరగతి, డిగ్రీ పూర్తిచేసిన వివాహిత మహిళలు ఎక్కువ ప్రాధాన్యత పొందతారు.
2. అంగన్వాడీ ఉద్యోగాల కోసం వయోపరిమితి ఎంత?
కనీసం 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 35 సంవత్సరాలు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితి సడలింపు ఉంటుంది.
3. దరఖాస్తు ఎలా చేయాలి?
అధికారిక వెబ్‌సైట్ wdcw.ap.gov.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయవచ్చు.
4. అంగన్వాడీ ఉద్యోగాల్లో వేతనం ఎంత ఉంటుంది?
అంగన్వాడీ కార్యకర్తలకి – ₹11,500 – ₹12,500
మినీ అంగన్వాడీ కార్యకర్తలకి – ₹9,000 – ₹11,000
హెల్పర్లకి – ₹9,000 – ₹11,000
5. ఎంపిక విధానం ఏంటి?
రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. అర్హులైన అభ్యర్థులకే ఉద్యోగ అవకాశం లభిస్తుంది.