Job Alert: ఉచిత శిక్షణ, వసతి, భోజనం తోపాటు ఉపాధి అవకాశాలు
Employment With Free Training : గ్రామీణ యువతకు ఎస్బీఐ ఆర్ సెటి ఉచిత శిక్షణతోపాటు ఉపాధి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు మార్చి 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
శిక్షణ కోర్సులు
• హౌస్ వైరింగ్
• ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ

అర్హతలు
• అభ్యర్థులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గ్రామీణ ప్రాంతాలవారు కావాలి.
• ఫోటోగ్రఫీ & వీడియోగ్రఫీ: కనీసం పదో తరగతి పూర్తి చేసి ఉండాలి.
• హౌస్ వైరింగ్: కనీసం 7వ తరగతి పూర్తి చేసి ఉండాలి.
• వయసు 18 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి.
• అభ్యర్థులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండాలి.
శిక్షణ వివరాలు
• కోర్సు 30 రోజులపాటు ఉచితంగా అందుబాటులో ఉంటుంది.
• శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు.
• బ్యాంకు రుణాల కోసం మద్దతు & మార్గదర్శకత్వం అందించబడుతుంది.
• ఉచిత భోజనం & వసతి సౌకర్యం కల్పిస్తారు.
దరఖాస్తు విధానం
• శిక్షణా కేంద్రం తిమ్మాపూర్ మండలం, ఎల్ఎండీ కాలనీ లో ఉంది.
• మార్చి 29 లోపు దరఖాస్తు చేయాలి.
• వివరాలకు సంప్రదించండి:
• 📞 98494 11002
• 📞 79811 51653

ఎస్బీఐ ఆర్సెట్ ప్రత్యేకతలు
• 2010లో ప్రారంభమైన ఈ శిక్షణా కేంద్రం 10,000+ మందికి పైగా శిక్షణ అందించింది.
• 7,149 మంది అభ్యర్థులు తమ రంగంలో స్థిరపడ్డారు.
• 3,395 మంది అభ్యర్థులు బ్యాంకు రుణాలు తీసుకుని స్వయం ఉపాధిని నెలకొల్పారు.
• ఉచిత శిక్షణ, వసతి, భోజనం అందించడం ప్రత్యేకత.