ఏపీ లో ఇంటి స్థలం లేని పేదలకు శుభవార్త.. 3034 గ్రామాలలో 1.25 లక్షల మందికి ఇళ్లస్థలాలు | AP Housing Scheme
AP Housing Scheme 2026 Eligibility Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటి స్థలం లేని నిరుపేదలకు పటాలు ఇచ్చేందుకు రెవిన్యూ శాఖ కార్యచరణ సిద్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే దరఖాస్తులను పరిశీలించి రెవెన్యూ శాఖ 1,24,873 మందికి కొత్త స్థలాలు ఇవ్వాలని గుర్తించింది. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ వరకు గ్రామాల్లో 3 సెంట్లు పట్టణాల్లో 2 సెంట్లు చొప్పున పేదలకు ఇల్లు స్థలం ఇస్తామని తెలిపారు. అందుకుగాను 4800 ఎకరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. భూ సేకరణలో 1800 కోట్ల అవసరమవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ భూషణ ప్రక్రియ నవంబర్ కి ప్రారంభం చేస్తామని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఇల్లు లేని వారికి పేద వివరాలను సేకరించి అర్హుత జాబితా రూపొందించాలని పేర్కొన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇళ్ల స్థలాల్లో దరఖాస్తులను రెవిన్యూ శాఖ ఆన్లైన్లో ద్వారా తీసుకుంటుంది. ప్రస్తుతం 4,59,051 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 1,43,496 లక్షల మంది అర్హులు గాను, 1,88,861 లక్షల మంది అనర్హులుగా తేల్చారు. ఇంకా 1,26,694 దరఖాస్తులపై విచారణ చేయవలసి ఉంది. వైకాపా హయాంలో ఇచ్చినటువంటి 43,498 ఇళ్ల పట్టాలు అనర్హులు ఇచ్చినట్లు గుర్తించి, వాటిని రద్దుచేసి ఆ స్థలాలు అర్హులకు కేటాయించడం జరిగింది. తొలి విడుదలలో 3034 గ్రామాలలో 1.25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని ప్రభుత్వం తెలుపుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల లేని పేదలు 2.50 లక్షల మంది ఉంటారని అంచనా ఇప్పటికే అందిన దరఖాస్తులు విచారణ తొలి విడుదలలో 1.53 లక్షల మందికి అర్హులుగా గుర్తించారు. వివిధ ప్రాంతాల్లో 2.56 లక్షల ఫ్లాట్లు ఖాళీలు ఉన్నాయి. వీటిలో 1692 గ్రామాలలో స్థలాలు తీసుకున్నందుకు 18,623 మంది అంగీకరించారు. మిగిలిన 1,24,873 మందికి 3034 గ్రామాలలో భూసేకరణ చేసి ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రభుత్వం తెలుపుతున్నారు. సగటు ఎకరానికి 37.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించవలసి ఉంటుంది. అర్హులైన జాబితా అక్టోబర్ లో రూపొందించి, నవంబర్ నుంచి భూసేకర ప్రారంభిస్తామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుపుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో ఇంటి స్థలం కోసం అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి అర్హత చూసుకున్నట్లయితే ఏపీ రేషన్ కార్డు కలిగి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ లో సొంత స్థలం, ఇల్లు ఉండకూడదు. గతంలో ఎప్పుడూ ఇంటి పట్టా పొంది ఉండకూడదు. 5 ఎకరాలలోపే మెట్ట భూమి, 2.5 ఎకరాల మాగాణి పొలం ఉండాలి. గతంలో స్థలం పొందిన వారు రద్దు చేసుకుంటే కొత్త స్థలం ఇస్తారు. త్వరలోనే దరఖాస్తులు స్వీకరణ VRO/ RIతో ఎంక్వైరీ, ఆ తర్వాత కలెక్టర్, తాసిల్దారు & కమిషన్ తుది జాబితా విడుదల చేస్తారు.


