ఏపీ లో 5 రోజుల్లోనే 6.81 లక్షల పెన్షన్ దరఖాస్తులు చివరి తేదీ ఎప్పుడంటే | AP new pension last date
Andhra Pradesh New Pension Applications Surge NTR Bharosa Eligibility Apply Online : ఆంధ్రప్రదేశ్లో ఐదు రోజుల్లోనే కొత్త పెన్షన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.6.81 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.. వివరాలకు వెళ్ళినట్లయితే.

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 7 తేదీ నుంచి ప్రారంభమైన కొత్త పెన్షన్ల కోసం స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాలలో ఐదు రోజులలోనే 6.81 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా వృద్ధులు పెన్షన్ కోసం అత్యధికంగా 3.76 లక్షల మంది చేసుకున్నారు. వితంతువులు 1.65 మంది ఉండగా, దివ్యాంగుల పెన్షన్ కోసం 1.09 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు మరియు డప్పు కళాకారుల నుండి 5655 దరఖాస్తులు అందినట్లు చెప్పారు. దరఖాస్తు కోసం ఈనెల 16 వరకు అయితే ఉంటుంది. ఈ సంఖ్య పెరిగే రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో చేనేత భరోసా పథకం కింద పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకోవాలనుకున్న నేతన్న బ్యాంక్ స్టేట్ మెంట్ అందచేయవలసిన అవసరం లేదని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత గారు స్పష్టత ఇచ్చారు. ఎందుకు గానం మాస్టర్ యువర్ నుంచి వేతనాలు తీసుకున్నట్లు వివరాలు అందచేస్తే సరిపోతుందని శుక్రవారం ప్రకటన చేశారు. 50 సంవత్సరాలు నిండిన చేనేతలందరికీ చేనేత భరోసా పెన్షన్ అందిస్తే అందజేస్తామని, అర్హులైన వారు ఆందోళన చెందనవసరం లేదని స్వస్థత చేశారు. అప్లికేషన్ పరిశీలనకు పాత నిబంధనలే అనుసరిస్తున్నామని తెలిపారు. ఇంకా డబ్బు కళాకారులు, చర్మకారులు సెల్ఫ్ డిక్లరేషన్ అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ప్రభుత్వం స్పష్టం చేసింది.
గ్రామ వార్డు సచివాలయాలలో ఈనెల 16 వరకు అప్లికేషన్ తీసుకుంటారు ఆ తర్వాత 17 నుంచి 21 మధ్యలో వెరిఫికేషన్ చేస్తారు. అలాగే ఈనెల 25, 26 తేదీన పెన్షన్ ప్రభుత్వం ఆమోదం అందిస్తుంది. అనంతరం అక్టోబర్ 1 నుంచి కొత్త పెన్షన్లు ఇస్తామని తెలియజేస్తున్నారు.


