SSC CPO 2026 Notification Released : Apply online for 1871 Sub Inspector Jobs Vacancy Eligibility and Last Date
SSC CPO 2026 vacancy apply now : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ద్వారా ఢిల్లీ పోలీస్ మరియు కేంద్ర సాయుధ పోలీసు దళాలలో సబ్-ఇన్స్పెక్టర్ పరీక్ష (CAPF) 2026 లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు 10 సెప్టెంబర్ నుంచి 30 సెప్టెంబర్ వరకు అధికార SSC వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన వివరాలు
• ఢిల్లీ పోలీస్ మరియు సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ (CAPF) నోటిఫికేషన్ విడుదల.
• రాత పరీక్ష ద్వారా సబ్-ఇన్స్పెక్టర్ల నియామకం.
• కేవలం ఏదైనా డిగ్రీ పాస్ అయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
• అప్లికేషన్ చివరి తేదీ: 30.09.2026

SSC CPO 2026 sub inspector Jobs 2026 : ఈ ఉద్యోగ నియామకాలు ఢిల్లీ పోలీస్ మరియు వివిధ సెంట్రల్ ఆర్మూర్ పోలీస్ కోర్సెస్ లో సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాల సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సెస్ సబ్ ఇన్స్పెక్టర్ ఫైర్ పోస్టులకు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందులో పూర్తిగా 1871 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ జాబ్స్ కి నెల జీతం రూ.35,400-రూ.1,12,400/- మధ్యలో ఇస్తారు. ఈ నియమకాలు పూర్తిగా రాత పరీక్ష ద్వారా నియమకాలు చేస్తారు. అది కూడా SSC CPO ద్వారా ఎంపిక చేయడం జరుగుతుంది.
కంప్యూటర్ ఆధారత పరీక్ష అర్హత సాధించిన అభ్యర్థులకు, శరీరక పరీక్షలు మరియు వైద్య పరీక్షల ద్వారా సెలక్షన్ చేస్తారు.
•పోస్టు మరియు ఖాళీ వివరాలు : ఈ నోటిఫికేషన్ ప్రకారం ఈ నియామకంలో ఢిల్లీ పోలీసులు 315 సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగాలు, CAPF లో 1467 సబ్ ఇన్స్పెక్టర్ (GD) ఉద్యోగాలు మరియు CISF 234 సబ్ ఇన్స్పెక్టర్ ఫైర్ ఉద్యోగాల ఉన్నాయి.
•అవసరమైన విద్యా అర్హత : ఢిల్లీ పోలీస్‌లో సబ్ ఇన్స్పెక్టర్ మరియు CAPFలలో సబ్ ఇన్స్పెక్టర్ (GD) పోస్టులకు విద్యా అర్హతగా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది ఉండాలి. తమ బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన పరీక్షకు హాజరైన అభ్యర్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. సబ్ ఇన్స్పెక్టర్ (ఫైర్) పోస్టుకు కావలసిన విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఫిజిక్స్, కెమిస్ట్రీ మరియు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులతో సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైనది; లేదా మెట్రిక్యులేషన్ లేదా దానికి సమానమైన విద్యతో పాటు, గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు లేదా సంస్థల నుండి మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్స్, కెమికల్, మైనింగ్, ఏరోనాటికల్, టెలికమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా దానికి సమానమైన పరీక్షలలో మూడేళ్ల డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి. ప్రాథమిక అర్హత (డిప్లొమా) ఉన్న పక్షంలో, సంబంధిత రంగాలలో ఉన్నత అర్హత అయిన బి.టెక్/ఎం.టెక్‌ను కూడా ఈ పోస్టుకు అదనపు విలువగా పరిగణించవచ్చు.
•గరిష్ట వయో పరిమితి : 01 ఆగస్టు 2026 నాటికి CISF లో సబ్ ఇన్స్పెక్టర్ (ఫైర్) ఉద్యోగాలకు 18 సంవత్సరాలు నుంచి 30 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి. మిగిలిన 20 నుంచి 20 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి వయసు సడలింపు ఉంటుంది.
•నెల జీతం : CAPES లో సబ్-ఇన్స్పెక్టర్ (GD): ఈ పోస్టుకు లెవెల్-6 (రూ.35,400-రూ.1,12,400/-) పే స్కేల్ ఉంటుంది మరియు ఇది గ్రూప్ ‘బి’ (నాన్-గెజిటెడ్), నాన్-మినిస్టీరియల్గా వర్గీకరించబడింది. ఢిల్లీ పోలీస్‌లో సబ్-ఇన్స్పెక్టర్ (ఎగ్జిక్యూటివ్) – (పురుషులు/మహిళలు): ఈ పోస్టుకు లెవెల్-6 (రూ.35,400-రూ.1,12,400/-) పే స్కేల్ ఉంటుంది మరియు దీనిని ఢిల్లీ పోలీస్ గ్రూప్ ‘సి’గా వర్గీకరించింది. CISEలో సబ్-ఇన్స్పెక్టర్ (అగ్నిమాపక)- (పురుషులు): ఈ పోస్టుకు లెవెల్-6 (రూ. 35,400-రూ.1,12,400/-) పే స్కేల్ ఉంటుంది మరియు ఇది గ్రూప్ ‘బి’ (నాన్-గెజిటెడ్), నాన్-మినిస్టీరియల్గా వర్గీకరించబడింది.
•అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో
•ఎంపిక విధానం : SSC CPO ఉద్యోగాలకు పరీక్షలో పేపర్-I, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (PST)/ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ (PET), పేపర్-II మరియు డీటెయిల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ (DME) ఉంటాయి.
•దరఖాస్తు రుసుము : చెల్లించవలసిన రుసుము: రూ.100/- (వంద రూపాయలు మాత్రమే). మహిళా అభ్యర్థులు మరియు షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST) మరియు రిజర్వేషన్‌కు అర్హులైన మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుండి మినహాయింపు ఉంది.
•ఎలా దరఖాస్తు చేయాలి: ఈ నోటీసుకు స్పందించి దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులందరూ కమిషన్ వెబ్సైట్ (https://ssc.gov.in)లో తమ వన్-టైమ్ రిజిస్ట్రేషన్ (OTR)ను పూర్తి చేయవలసి ఉంటుంది. పాత వెబ్సైట్ (https://ssc.nic.in)లో రూపొందించబడిన OTR కొత్త వెబ్‌సైట్‌కు పనిచేయదు. OTR పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థులు పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించడానికి ముందుకు వెళ్లవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించడానికి తేదీ : 10.09.2026
•ఆన్లైన్దరఖాస్తును సమర్పించడానికి చివరి తేదీ :: 30.09.2026 (23:00 గంటలు)

🛑NotificationPdf Click Here
🛑Apply Online Link Click Here

