తెలంగాణ ప్రభుత్వం అనర్హులు పెన్షన్ తొలగించి.. ఆగస్టు 15 నుంచి కొత్త పెన్షన్లు ఇవ్వనన్నారు | Telangana Aasara pension 2026
Telangana Aasara Pension August 15, 2026 Latest News : తెలంగాణ రాష్ట్రంలో లక్ష మందికిపైగా అనర్హులు పెన్షన్లు పేర్లను తొలగించి అర్హులకు పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేశారు. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే.

•కొత్తగా 1.30 లక్షల మందికి పెన్షన్ మంజూరు చేసి గవర్నమెంట్ జాబితా సిద్ధం చేశారు.
• ప్రయారిటీ ప్రకారం దివ్యాంగులకు, వితంతువులకు, ఒంటరి మహిళలకు & పేద వృద్ధులతో మొదటి పెన్షన్ జాబితాను రెడీ చేసింది.
• కొత్తగా ఆగస్టు 15న కొత్తగా ఆసరా పెన్షన్
తెలంగాణ రాష్ట్రంలో లక్షలాదిపైగా అనర్హుల పెన్షన్ అందుకున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. ఏళ్ల క్రితం చనిపోయిన వారి పేర్లపై డ్రా చేస్తున్నారని లైఫ్ అతడికేషన్ ప్రాసెస్ ఆధారంగా తెలుస్తుంది దీంతో ఆ పేర్లను తొలగించి అర్హులైన వారికి ఇవ్వాలని భావిస్తున్నారు. కొత్తగా రెండు లక్షల మందికి లబ్ధిదారులు గుర్తించినట్లు ప్రక్రియ ఇప్పటికే మొదలైనట్టుగా తాజా సమాచారం. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 1.30 లక్షల మందికి పెన్షన్ మంజూరుకు గవర్నమెంట్ తాజాగా జాబితా సిద్ధం చేశారు. పెన్షన్ కోసం 11 లక్షల దరఖాస్తు సర్పంచ్ కు అందాయి. వీటిలో నుంచి మొదటి ప్రయారిటీలో దివ్యాంగులకు, వితంతువులకు, ఒంటరిగా నివసిస్తున్న మహిళలు & పేద వృద్ధులతో జాబితా రెడీ చేస్తుంది. ఇటీవల సర్వేలో 1.20 లక్షల మంది అనర్హులుగా తేలడంతో వారికి ఆగస్టు నెల నుంచి పెన్షన్ నిలిపివేస్తామని అధికారులు ప్రకటించారు. కొత్తవారికి అదే నెల నుంచి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉంది.
తెలంగాణలో తలసేమియా, సికిల్ సెల్ అనీమియా బాధితులకు కూడా ఆగస్టు 15 నుంచి పెన్షన్ మంజూరు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారికంగా ఆదేశాలు జారీ చేస్తారు. అర్హత గుర్తింపు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని మరియు అలాగే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి తారు రహదారి, ప్రతి గ్రామం పంచాయతీ భవనం ఉండేలా చర్యలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఒక్కొక్కరికి రూ.4 వేల రూపాయలు సామాజిక భద్రత పెన్షన్, దివ్యాంగులకు రూ.6000/- & శాశ్వతంగా మంచానికి పరిమితమై వైద్య సేవలు పొందుతున్న అభ్యర్థులకు రూ.15,000/- ఆసరా పెన్షన్ పొందుతారు.


