PMAY 2.0 | కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలలో ఇళ్లు లేనివారికి… అదనగా 5 లక్షల ఇళ్లలు… ఒక్కొక్క ఇంటికి 3 లక్షల ఆర్థిక సహాయం పూర్తి వివరాలు ఇవే
PMAY 2.0 Housing Scheme Increase 5 lacs houses : ఆంధ్రప్రదేశ్ లో మరియు తెలంగాణలో ఇళ్లు లేని వారికి కేంద్ర ప్రభుత్వం సూపర్ గుడ్ న్యూస్.. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద అదనంగా 5 లక్షలు ఇళ్లు ఇస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.

ప్రధానమంత్రి ఆవాస్ యోజన (PMAY) కింద తెలుగు రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం అదనంగా ఇళ్లు కేటాయించింది. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల ఇళ్ల కేటాయించిన కేంద్ర ప్రభుత్వం.. అదనంగా మరో ఆంధ్రప్రదేశ్ లో 3 లక్షలు తెలంగాణలో 2 లక్షలు మంజూరు చేసింది. ఆవాస్ ప్లస్ యాప్ తో పారదర్శకంగా లబ్ధిదారుని ఎంపిక చేసి జరుగుతుందని కేంద్రమంత్రి పెమ్మసాని తెలిపారు. గతంలో మంజూరైన వాటితో కలిపి ఇవన్నీ రెండు మూడు ఏళ్ల పూర్తి చేస్తామని తెలిపారు. ఒక్కో ఇంటికి ప్రాథమిక సహాయంగా రూ.1.20 లక్షలు, అదనపు సహాయం రూ.1.80 లక్షలు అందుతాయిని తెలిపారు.
ఈ నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాలలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వేలాది ఇళ్లు లేని నిరుపేదల కుటుంబాలకు సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు వెలుగు పాటు కలిగింది త్వరలో సంబంధిత జిల్లాల వారీగా లబ్ధిదారులు ఎంపిక ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. తొలి విడుదలలో 1.5 లక్షల మంది స్థలాలు ఇవ్వాలని నిర్ణయిస్తున్నట్లు తెలుస్తుంది. గ్రామంలో ఎకరం స్థలానికి 25 మందికి (మూడు సెంట్లు చొప్పున), పట్టణాలలో ఈ 35 నుంచి 45 మందికి (2 సెట్లు చొప్పున) కేటాయించనున్నదని సమాచారం. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ లో అర్హత జాబితా ఖరారు చేసి, నవంబర్ నుంచి భూసేకరణ ప్రారంభమవుతుందని తెలుపుతున్నారు.


