మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్.. గడువు పొడిగింపు.. వెంటనే మొబైల్ లో ఇలా అప్లై చేసుకోండి | Free Intintiki Indiramma Kuttu Machine 2026 Last Date extended
Free Intintiki Indiramma Kuttu Machine 2026 Last Date extended: అభ్యర్థులకు శుభవార్త.. ఉచితంగా ఆటోమెటిక్ కుట్టుమిషన్.. పొందే సువర్ణ అవకాశం.. ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మెషీన్లు పథకానికి గడువు పడిగిస్తూ సెప్టెంబర్ 30 లోపు ఆన్లైన్లో https://tgobmms.cgg.gov.in/దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ రాష్ట్రంలో బీసీ మహిళలకు స్వయం ఉపాధి పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ ప్రారంభించిన సంగతి తెలిసినదే. ఎందుకు అప్లికేషన్ చేసుకోవడానికి సెప్టెంబర్ 15న ముగిసింది.. కానీ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. బీసీ మహిళలకు 100% సబ్సిడీతో ఆటోమేటిక్ కుట్టుమిషన్లు ఒక నియోజకవర్గంలో 1000 చొప్పున మొత్తం 1.19 లక్షల మందికి ఆటోమేటిక్ కుట్టు మిషన్లు పంపిణీ చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రక్రియ సెప్టెంబర్ 30 తేదీ వరకు కొనసాగుతుందని తెలిపారు.

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ అర్హతలు క్రింది విధంగా ఉన్నాయి :
•ఈ కుట్టు మిషన్ కోసం తెలంగాణ ప్రజలు అయి ఉండాలి.
•బీసీ నిరుద్యోగ మహిళలు ఉడాలి.
•18 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాల మధ్యలో అర్హులు.
•5th క్లాస్ ఆపై చదివిన అందరు కూడా అప్లై చేసుకోవచ్చు.
•వారి యొక్క వార్షికాదాయం గ్రామాలలో 1.5 లక్షలు & పట్టణాలలో 2 లక్షల మించి ఉండరాదు.
•ఒక ఫ్యామిలీకి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారు.
•ఎక్కువ ప్రాధాన్యత ఒంటరి మహిళలకు, వితంతువులకు, వికలాంగులకు, అనాధలకు & కుట్లు వృత్తిలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు.
కావలసినటువంటి డాక్యుమెంట్ వివరాలు :
•ఆధార్ కార్డు
•రేషన్ కార్డు కాస్ట్
•ఇన్కమ్ సర్టిఫికెట్
•ఫోటో బ్యాంకు బుక్
•టైలరింగ్ శిక్షణ సర్టిఫికేట్
ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ అప్లికేషన్ చేసుకోవడానికి Step By Step Process
1. ముందుగా మహిళా అభ్యర్థులు https://tgobmms.cgg.gov.in/ ఈ వెబ్సైట్ ని ఓపెన్ చేయండి.
2. అందులోనే హోం పేజ్ లో Apply Online for availing the Intintiki Indiramma Kuttu Machine scheme (BC Corporation – 2026-27) ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
3.అందులో మీ పేరు, ఆధార్ నెం, రేషన్ కార్డు నెం, గ్రామీణ & అర్బన్, తండ్రి / భర్త పేరు, మీసేవ ఆదాయ ధృవీకరణ పత్రం నెం, పుట్టిన తేదీ (dd/mm/yyyy), వయస్సు, వార్షిక ఆదాయం (రూ.), లింగం, వైవాహిక స్థితి, మొబైల్ నంబర్, కుల ధృవీకరణ పత్రం) నెం ఈ డీటెయిల్ అని ఫిలప్ చేయండి.
4. దరఖాస్తుదారు యొక్క చిరునామా వివరాలు జిల్లా, నియోజకవర్గం, మండలం/పురపాలక సంఘం, పంచాయతీ, పిన్కోడ్, డోర్ నెం, ఆధార్ ప్రకారం ఉత్తర ప్రత్యుత్తరాల కోసం చిరునామా పూర్తి వివరాలు ఫిలప్ చేయండి.
5. దరఖాస్తుదారు ఫోటో & టైలరింగ్ శిక్షణ సర్టిఫికేట్ jpg/png ఫార్మాట్లో మాత్రమే అప్లోడ్ చేయాలి.
6. Self decoration కింద బాక్స్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి.
ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మెషీన్ పథకం కోసం అప్లై చేసుకోవడానికి ఆగస్టు 14 నుంచి దరఖాస్తు గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించారు. TG OBMMS ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

🛑Apply Link Click Here

