TGWDCW : 12th అర్హతతో అంగన్వాడిలో 62 టీచర్ పోస్టులు

TGWDCW : 12th అర్హతతో అంగన్వాడిలో 62 టీచర్ పోస్టులు

TGWDCW Anganwadi Teacher Jobs  : తెలంగాణ ప్రభుత్వం, జిల్లా సంక్షేమాధికారి, మహిళా శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ లో (62) అంగన్వాడి టీచరు పోస్టులు భర్తీచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరనైనది.

మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ, మేడ్చల్ మల్కాజిరి జిల్లాలో గల (3) ఐ.సి.డి.ఎస్. ప్రాటెక్ట్స్ ఆల్వాల్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ లలో ఖాళీగా ఉన్న (62) అంగన్వాడి టీచరు పోస్టులు భర్తీచేయడానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు కోరనైనది.

దరఖాస్తు తేదీలు:

దరఖాస్తు ప్రారంట తేది: 27.07.2026

దరఖాస్తు ముగింపు తేది: 05.08.2026

అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు:

విద్యార్హత: సదరు అభ్యర్ధునీలు తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండవలయును.

•వయస్సు: 01/07/2026 నాటికి 18 సంవత్సరములు నుండి 35 సంవత్సరములలోపు ఉండాలి.

•స్థానికత: దరఖాస్తు చేసుకోబోయే మహిళ అభ్యర్తులు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి. గ్రామీణ ప్రాంతానికి చెందిన వారు సదరు గ్రామ పంచాయతీ నివాసులై ఉండాలి/పట్టణ ప్రాంతానికి (GHMC/MMC/CMC), చెందిన వారు ఆ ప్రాంత వార్డ్ కు చెందిన వారు అయి ఉండాలి.

ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్సీ / ఎస్టీ లకు కేటాయించిన, అంగన్ వాడీ టీచర్ పోస్టులకు అదే హామ్లెట్/ఆవాసం (Habitation) కు చెందిన ఎస్సీ / ఎస్టీ అభ్యర్ధులు మాత్రమే అర్హులు.

సంబందిత తహసిల్దార్ గారిచే దృవీకరించిన నివాస దృవీకరణ పత్రము తప్పనిసరిగా జతచేయవలయును. ఈ నోటిఫికేషన్ జారీ చేసిన తేదీ నుండి ఒక సంవత్సరము లోపు తీసుకున్న నివాస ధ్రువీకరణ పత్రములను మాత్రమే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

రిజర్వేషన్: పోస్టువారీగా నిర్దేశించిన రోస్టర్ పాయింట్ (కులం/వర్గం)కు సంబంధించిన అభ్యర్ధనులు మాత్రమే అర్హులు. ఒక వేళ అభ్యర్థిని పేరులో ఏమైనా మార్పు ఉన్నట్లయితే అది గెజిట్ లో గాని, కోర్టు ఉత్తర్వులు గానీ ఉంటనే ఆ అభ్యర్ధని పేరును పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.

ఈ క్రింద తెలపబడిన వికలాంగులైన అభ్యర్థినులు కూడా దరఖాస్తు చేసుకోనవచ్చు.

1. వినికిడి పరికరాన్ని ఉపయోగించి వినగలిగిన వారు.

2. అంధత్వం ఉన్నప్పటికీ (Escort) ఇతరుల సహాయం లేకుండా విదులు నిర్వర్తించు కోగలిగిన వారు.

3. కాళ్ళు, చేతులకు సంబందించిన అంగ వైకల్యం కలిగినప్పటికీ పూర్వ ప్రాదమిక విద్యను నేర్పుటకు గానీ, పిల్లల సంరక్షణ కు ఎలాంటి ఆటంకం లేకుండా చేయగలిగిన వారు.

ఆన్లైన్లో అప్లోడ్ చేయావలసిన ద్రువపత్రాలు (Scanned copies)

1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణపత్రము (SSC certificate).

2. కుల దృవీకరణ పత్రము తహసిల్దార్ చే జారీ చేయబడినది

3. విద్యార్హత దృవీకరణపత్రము, ఇంటర్ మార్కుల జాబితా

4. నివాస దృవీకరణపత్రము తహసిల్దార్ చే జారీ చేయబడినది

5. అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్

6. వితంతువు అయితే భర్త మరణ దృవీకరణపత్రము.

7. ఆనాథ అయితే ఆనాద సర్టిఫికేట్ తహసిల్దార్ చే జారీ చేయబడినది.

8. వోటర్ ఐ.డి కార్డ్,

9. ఆధార్ కార్డ్.

దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు సూచనలు

దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు తాము దరఖాస్తు చేసుకున్న అంగన్వాడీ కేంద్రానికి సంబంధించిన ఐ.సి.డి.ఎస్. ప్రాజెక్టు కార్యాలయంలో, తేది: 27-07-2026 ఉదయం 10.30 గంటల నుండి 05-08-2026 సాయంత్రం 5.00 గంటల వరకు, అన్ని కార్యాలయ పని వేళలలో, తమ దరఖాస్తులో పేర్కొన్న అర్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలను (All Certificates) నూ గెజిటెడ్ అధికారి (Gazetted Officer) ద్వారా ధృవీకరించబడిన (Attested) జిరాక్స్ ప్రతులను ద్రువపత్రాల పరిశీలన కొరకు సమర్పించవలెను. నిర్ణీత గడువులో ధ్రువపత్రాలను సమర్పించని లేదా ధ్రువపత్రాల పరిశీలనకు హాజరు కాని అభ్యర్ధుల దరఖాస్తులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోబడవు.

క్రింద తెలిపిన వెబ్ సైట్ లో దరకాస్తు చేసుకోగలరు, ఖాళీలు, విద్యార్హత, వయస్సు, స్థానికత మరియు సంబందించిన పూర్తి వివరములు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు చూడగలరు.

🛑Notification Pdf Click Here

🛑Vacancy Details Click Here

🛑Apply Online Link Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *