AP రాష్ట్రంలో మరో కొత్త పథకం.. సంవత్సరానికి ఒక్కొక్కరికీ 25 వేల చొప్పున ఆర్థిక సహాయం.. పూర్తి వివరాలు ఇవే | Andhra Pradesh Netannala Sevalo scheme 2026
Andhra Pradesh Netannala Sevalo scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆగస్టు 7 తేదీన మరో కొత్త పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపారు. సంవత్సరానికి ఒక్కొక్కరికి 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే!

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 51,952 మందికి ఆర్థిక సహాయం అందజేయన్నది జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఈ పథకం 7 ఆగస్టు 2025 నుంచి నేతన్న సేవలో పథకానికి అమలు చేస్తున్నట్టు మంత్రి సునీత గారు వెల్లడించారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క చేనేత కుటుంబానికి 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు. ఇటీవల ఈ స్కీము కు సంబంధించి క్యాబినెట్ ఆమోదం కూడా వచ్చిన విషయం తెలిసినదే. సొంత మగ్గం ఉన్నా ఈ వృత్తి చేసే కార్మికులతో పాటు చేనేత అనుభవం రంగులైన రంగులు అద్దడం, రాట్నం వడకడం తదితర విభాగాల వారు అర్హులే అని తెలిపారు. దారిద్ర రేఖకు (BPL) దిగువన ఉన్న వయసుతో సంబంధం లేకుండా ఏటా 25 వేల చొప్పున ప్రభుత్వం నేరుగా ఆర్థిక సహాయం అందచేయునది.
గత YCP ప్రభుత్వం హయాంలో నేతన్న నేస్తం కింద 24000 సహాయం అందించేది. అందులో కూడా 50 ఏళ్లు దాటిన వారికి సామాజిక పత్రిక పెన్షన్ వస్తుందని నేపథ్యంలో ఒకరికి ఒక పథకం లబ్ధి అన్న విధానాన్ని పాటిస్తూ అర్హులున్న ఈ పథకం ప్రయోజనం అందలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం వచ్చాక పాత విధానాన్ని పూర్తిగా తీసేస్తుంది. ఇతర సంక్షేమ పథకాలు అందుతున్నప్పటికీ, వయసుతో సంబంధం లేకుండా సొంత మగ్గం ఉండి చేనేత వృత్తి చేసే ప్రతి అర్హత కలిగిన కుటుంబానికి సంవత్సరానికి 25 వేల చొప్పున అందించాలని సీఎం గారు స్పష్టం చేశారు.


