తల్లికి వందనం డబ్బులు రాని వారికి.. మరొక అవకాశ.. రెండో జాబితా ఎప్పుడంటే? | AP Thalliki Vandanam Scheme 2026
AP Thalliki Vandanam Scheme 2026 2nd chance Apply Latest News : ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం అర్హులైన ఆర్థిక సహాయం అందని విద్యార్థుల తల్లులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక అవకాశం కల్పిస్తుంది. అర్హత అనర్హత జాబితా స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయంలో ప్రదర్శించారు.

ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం అభ్యంతరాలు, ఫిర్యాదులు మూడు ఆగస్టు వరకు స్వీకరిస్తున్నారు. అందిన ఫిర్యాదులను నాలుగు ఆగస్టు నుంచి పది ఆగస్టు వరకు పరిశీలిస్తున్నారు. ఆ తరువాత అదనపు అర్హత జాబితాను అధికారికంగా సిద్ధం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో మొదటి జాబితాలో ఆర్థిక సహాయం అందనివారు అర్హత ఉన్నప్పటికీ జాబితాలో పేరు లేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలిపారు. కొత్తగా అర్హత గుర్తించిన విద్యార్థులతో పాటు ఒకటో తరగతి నుంచి జూనియర్ ఇంటర్ తాజాగా చేర విద్యార్థులకు జాబితాను ఆగస్టు 30న విడుదల చేయనున్నారు.
ఆగస్టు 30 రోజునే అర్హులైన లబ్ధిదారుల ఖాతాలో ఆర్థిక సహాయం జమ చేస్తున్నట్లు ప్రభుత్వం తెలిపారు. అయితే ఒకటవ తరగతి నుంచి జూనియర్ ఇంటర్ కొత్తగా చేరే విద్యార్థుల ప్రవేశ లకు 25 ఆగస్టు 2026 గడువు నిర్ణయించారు. ఆలోపే ప్రవేశాలు పూర్తి చేస్తున్న వారికి అవసరమైన పత్రాలతో సంబంధిత స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయాలలో సంప్రదించి సూచించాలని తెలిపారు. రెండో విడుదలలో 30న తల్లుల ఖాతాలో నిధులు జమ కానన్నాయి. రానివారు కంగారు పడనవసరం లేదు. వెంటనే స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయంలో సంప్రదించి ఆగస్టు 3 లోపల తమ ఫిర్యాదును చేసుకోవాలని తెలిపారు. అలాగే బ్యాంకు అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. NPCI మ్యాపింగ్ అయి ఉండాలి అప్పుడే తల్లికి వందనం అమౌంట్ డైరెక్ట్ గా తల్లుల ఖాతాలో జమకానన్నాయి.


