ఏపీ ఎసైన్డ్ భూముల్ని.. జస్ట్ రూ.100/-కు వారసుల తమ పేరులతో రిజిస్ట్రేషన్ మార్చుకోవచ్చు.. కొత్త విధానం అమల్లోకి | AP Assigned Land registration new guidelines
AP Assigned Land Registration 2026 new rules : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎసైన్డ్ భూమల్ని వారసుడు తమ పేరును మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఈ సోమవారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభమైంది. ఇంకనుంచి వారసత్వం మ్యుటేషన్ కింద దరఖాస్తు చేసుకున్న అవసరం లేదు. ఏపీలో ఈ భూముల్ని జస్ట్ రూ. 100/- కి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

ఎసైన్డ్ భూముల్ని తమ పేరును మార్చుకోవడానికి తాసిల్దారి కార్యాలయం చుట్టూ తిరగడం అవసరం లేదు డైరెక్ట్ గా ఇప్పుడు రిజిస్టర్ కార్యాలయం కు వెళ్లి భాగా పరిష్కార రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఈ విధంగా అందుబాటులో వచ్చింది. వారసత్వ మ్యుటేషన్ సేవలు గ్రామ సచివాలయాలు దరఖాస్తు చేసుకునే విధానాన్ని నిలిపేశారు.
బాగా పంపిణీ రిజిస్ట్రేషన్ కు పెద్దగా ఖర్చు కూడా లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారసత్వ భూములను రిజిస్ట్రేషన్ సంబంధించి ఇటీవల ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులు వర్తిస్తాయి. ఆస్తి విలువ 10 లక్షల లోపు అయితే స్టాంపు కు రూ.100/- రూపాయిలు ఉంటుంది. అలాగే ఆస్తి విలువ 10 లక్షల పైన ఉంటే రూ.1000/- చెల్లిస్తే సరిపోతుంది.
ఎసైన్డ్ భూమిని తమ పేరుతో మార్చుకోవా లంటే యజమాని మరణ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలి. అలాగే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ తప్పనిసరి వీటితో పాటు బాగా పరిష్కార దస్తావేజులు రాయించుకుని.. రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అందచేయాలి. రిజిస్ట్రేషన్ అయిన వెంటనే తాసిల్దార్ కార్యాలయం సంబంధించిన వ్యక్తుల పేర్లతో మ్యుటేషన్ పూర్తవుతుంది. ప్రస్తుతం అధికారుల చుట్టూ తిరిగిన అవసరం లేదు.

ఈ భూములు ఇతరులకు అమ్ముకోవడానికి కుదరదు. నిబంధన ప్రకారం 20 సంవత్సరాలు నిండాకే అమ్ముకునేందుకు అనుమతిస్తున్నారు.

