Conductor Jobs : RTC లో 1500 కండక్టర్ ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది | TSRTC Conductor Notification 2026
TSRTC Conductor Notification 2026 Coming SoonLatest News : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1500 కండక్టర్ ఉద్యోగుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చ జెండా ఊపింది. ఈ కండక్టర్ ఉద్యోగాలు విడుదల చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం సర్వసిద్ధమయింది. 10వ తరగతి మార్క్స్ ఆధారంగా ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. అయితే పదో తరగతి మార్కుల్లో కొంతమంది గ్రేడింగ్ మరియు కొంతమందికి మార్క్స్ ఉండడంతో ఎస్ఎస్సి బోర్డు కు ఆర్టీసీ యాజమాన్యం లేఖ రాసింది. గ్రేడింగ్ మార్క్స్ శాతం ఎలా లెక్కించాలో దానిపై కర్రస్తు చేస్తుంది.

రాష్ట్రవ్యాప్తంగా 1500 కండక్టర్ ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రోడ్డు రవాణా సంస్థ (RTC) యాజమాన్యమే ఈ ఉద్యోగుల భర్తీ చేపడుతుంది. ఈ ఉద్యోగాలు పూర్తిగా పదవ తరగతి వచ్చిన మార్క్స్ ఆధారంగా ఉద్యోగాలు ఎంపిక చేస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వ నుంచి అనుమతి రావడంతో నియామక ప్రక్రియలపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టి పెట్టారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అనంతరం TSRTC ఆర్భవించిన తర్వాత ఇప్పటివరకు కండక్టర్ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. కొంతకాలం క్రితం తాత్కాలిక పద్ధతిలో హైదరాబాద్ సికింద్రాబాద్ సహా వివిధ డివిజన్లో పరిధిలో డిపోలలో నియామకాలు చేపట్టారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో 1500 ఉద్యోగుల భర్తీకి ఆర్టీసీ సర్వసిద్ధం చేశారు.
ఈ కండక్టర్ ఉద్యోగులకు పదో తరగతి వచ్చిన మార్క్స్ శాతం ఆధారంగా తీసుకుని ఎంపిక చేసే విధంగా ఆర్టీసీ ఉంది. త్వరలోనే RTC లో కండక్టర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆర్టీసీ భావిస్తున్నట్లు సమాచారం


