రాత పరీక్ష లేకుండా కొత్త గా మరో జిల్లాలో Anganwadi ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Anganwadi Teacher & Anganwadi Assistant New District Recruitment 2026
Anganwadi Teacher & Anganwadi Assistant Nizamabad District Recruitment 2026 Apply Online Now : తెలంగాణలో మరొక జిల్లాలో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో ఐదు ఐసిడిస్ ప్రాజెక్టులో ఖాళీగా 76 అంగన్వాడి టీచర్ & 103 అంగన్వాడి సహాయకురాళ్ళ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు. దరఖాస్తు ఫారాల చేసుకోవడానికి చివరి తేదీ 23 జులై 2026 లోపు wdcw.tg.nic.in ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

నిజామాబాదు జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయో వృద్ధుల శాఖ, పరిధిలో గల (5) ఐ.సి.డి.ఎన్. ప్రాజెక్ట్ ల పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడి టీచర్, అంగన్వాడి సహాయకురాళ్ళ (ST ఏరియా) పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారము మొదటి విడత నియామకమునకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ఆన్లైన్ దరఖాస్తులను కోరనైనది. ఖాళీలు, విద్యార్హత మరియు రిజర్వేషన్లకు సంబంధించిన పూర్తి వివరములు wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు పొందగలరు. దరఖాస్తు ఫారాలు తీసుకొను తేది: 08.07.2026, దరఖాస్తు ఫారాల చివరి తేది: 23.07.2026 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
విద్యార్హతలు: అంగన్ వాడి టీచర్ పోస్టుకు ఇంటర్ లేదా 12 వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అంగన్ వాడి సహాయకురాళ్ళ పోస్టునకు ఇంటర్ లేదా 12వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు అందుబాటులో లేని ఎడల పదొవ తరగతి అభ్యర్థులను పరిగణలోనికి తీసుకొనబడును.
వయస్సు: తేది: 01.07.2026 నాటికి 18 సంవత్సరములు నిండి 35 సంవత్సరముల లోపు ఉండవలెను. స్థానికత: అభ్యర్థులు సంబంధిత అంగన్ వాడి కేంద్ర పరిధి లోని (Municipal Areas నందు Ward/ Division) (Rural Areas స్థానిక గ్రామ పంచాయతి) నివాసులై ఉండవలెను (నివాస ధృవీకరణ పత్రము సంబంధిత తహసిల్దార్ గారిచే ధృవీకరించబడి ఉండవలెను.
ఎంపిక విధానము: ఇంటర్ మార్కుల మెరిట్ 70 మార్కులు. ప్రత్యేక కేటగిరీలు: (వితంతువులు-5 మార్కులు, అనాధలు (As per JJ act 2015)- 10 మార్కులు, దివ్యాంగులు-5 మార్కులు, జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ- 10 మార్కులు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు వారి వారి ఒరిజినల్ ధృవ పత్రములను సంబంధిత ఐ.సి.డి.ఎస్. కార్యాలయాలలో 27.07.2026 నుండి 05.08.2026 వరకు అన్ని కార్యాలయ పనివేలల్లో ఒరిజినల్ ధృవ పత్రాలను పరిశీలనకు సమర్పించవలెను. లేని ఎడల వారి దరఖాస్తులు పరిగణలోనికి తీసుకొనబడవు. ఈ నోటిఫికేషన్ ను పూర్తిగా రద్దు పరచటానికి గాని, మార్పులు చేయడానికి గాని ఈ దిగువ సంతకం దారుకు పూర్తి అధికారం కలదు. (జిల్లా కలెక్టర్, నిజామాబాదు గారి అనుమతితో ఈ ప్రకటన జారీ చేయనైనది).

🛑Notification Pdf Click Here
🛑Vacancy And Roster List Click Here
🛑Apply Online Link Click Here
🛑Official Website Click Here

