తెలంగాణ స్పెషల్ TET-2 నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులకు తేదీలు ఇవే
Telangana Special TET 2 Notification 2026 Latest News : తెలంగాణలో ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించిన స్పెషల్ టెట్-2 నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ ఈ నోటిఫికేషన్‌ను తాజాగా ప్రకటించింది. అర్హత ఉన్న ఉపాధ్యాయులు నిర్ణీత సమయంలో దరఖాస్తు చేసుకోవాలి.
తెలంగాణ స్పెషల్ టెట్-2 నోటిఫికేషన్ విడుదలైంది. ఇన్ సర్వీస్ టీచర్లు అక్టోబర్ 7 నుంచి 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నవంబర్ 16 నుంచి 21 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఇదిలా ఉండగా, స్పెషల్ టెట్-1 ఫలితాలను గత నెలలో విడుదల చేశారు. ఈ పరీక్షలో మొత్తం 15,749 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. ఇప్పుడు స్పెషల్ టెట్-2 నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇన్ సర్వీస్ టీచర్లలో ఆసక్తి పెరిగింది.
అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్‌లో ఉన్న అర్హతలు, పరీక్ష విధానం, ముఖ్యమైన తేదీలు https://schooledu.telangana.gov.in/ అధికారిక వెబ్సైట్ లో ఇవ్వడం జరిగింది.


