BSNL కస్టమర్లకు శుభవార్త.. రూ.1 లక్ష వరకు ఉచిత బీమా, రూ.10 వేల సైబర్ కవరేజీ

BSNL కస్టమర్లకు శుభవార్త.. రూ.1 లక్ష వరకు ఉచిత బీమా, రూ.10 వేల సైబర్ కవరేజీ

BSNL Free Insurance STV 202 STV 2449 Latest News : BSNL STV 202, STV 2449 ప్లాన్లపై రూ.1 లక్ష వరకు ప్రమాద బీమా మరియు రూ.10 వేల వరకు సైబర్ ఫ్రాడ్ కవరేజీ కొత్త ప్లాన్ ని తీసుకొచ్చారు. పూర్తి వివరాలు తెలుసుకోండి.

BSNL కస్టమర్లకు సంస్థ కొత్త ప్రయోజనాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఎంపిక చేసిన రెండు ప్రీపెయిడ్ ప్లాన్లతో రీఛార్జ్ చేసుకునే వారికి అదనపు ఖర్చు లేకుండా బీమా రక్షణతో పాటు సైబర్ ఫ్రాడ్ కవరేజీని ఇస్తారు. ఈ అవకాశం అక్టోబర్ 1, 2026 నుంచి అమల్లోకి రానున్నది.

BSNL తీసుకొచ్చిన ఈ ప్రయోజనం STV 202, STV 2449 ప్రీపెయిడ్ ప్లాన్లకు వర్తిస్తుంది. ఈ రెండు ప్లాన్లతో రీఛార్జ్ చేసిన వినియోగదారులకు ప్రత్యేకంగా మరో బీమా ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు.అర్హత ఉన్న ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన కస్టమర్ ప్రమాదవశాత్తు మరణిస్తే, పాలసీ నిబంధనలకు అనుగుణంగా రూ.1 లక్ష వరకు ప్రమాద మరణ బీమా అందుబాటులో ఉంటుంది. ఈ బీమా సేవలను అందించేందుకు BSNL, ది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీతో భాగస్వామ్యం చేసుకుంది. అర్హత ఉన్న వినియోగదారులకు సైబర్ ఫ్రాడ్ వల్ల కలిగే నష్టాలకు రూ.10,000 వరకు కవరేజీ లభిస్తుంది. అర్హత ఉన్న STV ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత బీమా ప్రయోజనం ఆటోమేటిక్‌గా యాక్టివేట్ అవుతుంది.

STV 202 ప్లాన్‌లో 300 నిమిషాల వాయిస్ కాల్స్, 5GB డేటా, 100 SMSలు అందుబాటులో ఉన్నాయి. STV 2449 ప్లాన్‌లో 365 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు లభిస్తాయి. ఈ ప్లాన్లకు అనుసంధానంగా బీమా, సైబర్ ఫ్రాడ్ కవరేజీ కూడా అందుబాటులోకి వచ్చింది. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం, కవరేజీ రీఛార్జ్ అనంతరం సుమారు 24 గంటల్లో ప్రారంభమవుతుంది. పాలసీకి సంబంధించిన వివరాలు SMS ద్వారా వినియోగదారులకు పంపబడతాయి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan →

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *