తల్లికి వందనం రెండో విడత డబ్బులు ఎప్పుడు? రూ.13 వేల కోసం ఎదురుచూపులు
Thalliki Vandanam Second Installment 13000 Ap Latest News : AP తల్లికి వందనం రెండో విడత నిధుల కోసం అర్హులు ఎదురుచూస్తున్నారు. సుమారు 2.7 లక్షల మందికి రూ.13,000 చొప్పున అందే అవకాశం ఉంది. నిధుల విడుదలపై తాజా వివరాలు.

ఆంధ్రప్రదేశ్‌లో తల్లికి వందనం పథకం రెండో విడత నిధుల కోసం అర్హులైన తల్లులు ఎదురుచూస్తున్నారు. మొదటి విడతలో డబ్బులు అందని విద్యార్థుల కుటుంబాలకు రెండో విడతలో రూ.13,000 చొప్పున జమ చేయనున్నట్లు ప్రభుత్వం గతంలో ప్రకటించింది.
ఆగస్టు 30న రెండో విడత నిధులు విడుదల చేస్తామని గతంలో ప్రభుత్వం తెలిపింది. అయితే సెప్టెంబర్ 30 దాటినా ఇప్పటివరకు అర్హులైన వారి బ్యాంకు ఖాతాల్లో రూ.13,000 జమ కాలేదు. దీంతో డబ్బులు ఎప్పుడు వస్తాయనే ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ కేటగిరీల్లో కలిపి సుమారు 2.7 లక్షల మంది లబ్ధిదారులు ఉండవచ్చని తెలుస్తోంది.
ఒకటో తరగతిలో కొత్తగా చేరిన విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ పొందినవారు, అలాగే వివిధ కారణాలతో మొదటి విడతలో తల్లికి వందనం సాయం అందుకోలేకపోయినవారిని రెండో విడతలో పరిగణనలోకి తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం రెండో విడతకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో)లో ఉన్నట్లు సమాచారం. ఫైలుకు ఆమోదం లభించిన తర్వాత నిధుల విడుదలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. నిధుల విడుదల తేదీపై స్పష్టత వచ్చిన వెంటనే అర్హుల ఖాతాల్లో రూ.13,000 జమ అయ్యే అవకాశం ఉంది.


