గుడ్ న్యూస్… Indian Armyలో ఉద్యోగ నియామకం.. నెలకు రూ.56,100 జీతం
Indian Army TGC 142 Recruitment 2025 Notification Apply Online In Telugu
Indian Army : నిరుద్యోగులకు శుభవార్త… దేశాన్ని సేవ చేయాలన్న తపన ఉన్న యువతకు ఇది గొప్ప అవకాశం. 2025 సంవత్సరానికి గాను ఇండియన్ ఆర్మీ విడుదల చేసిన 142వ టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-142) నోటిఫికేషన్ ద్వారా దేశ సేవతో పాటు శాశ్వత ఉద్యోగం పొందే అవకాశాన్ని అందిస్తోంది. ఇది ప్రత్యేకంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన పురుష అభ్యర్థుల కోసం విడుదల చేసిన బంపర్ నోటిఫికేషన్స్. అప్లికేషన్ ఫీజు లేదు. అప్లికేషన్ చివరి తేదీ 29 మే 2025.
ఇండియన్ ఆర్మీ సంస్థ ద్వారా టెక్నికల్ గ్రాడ్యుయేట్ కోర్సు (TGC-142) కోసం నోటిఫికేషన్ విడుదల. మొత్తం 30 ఉన్నాయి. దరఖాస్తు విధానం ఆన్‌లైన్ ద్వారా మాత్రమే ఉటుంది. అర్హత, జీవితం, వయసు, మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

అర్హతలు : విద్యార్హత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి B.E. / B.Tech పూర్తి చేసినవారు లేదా ఫైనల్ ఇయర్‌లో చదువుతున్నవారు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి : కనీసం 20 నుండి గరిష్టంగా 27 సంవత్సరాల మధ్య (జననం 02 జనవరి 1998 – 01 జనవరి 2005 మధ్య జరిగి ఉండాలి). కేవలం పురుష అభ్యర్థులే అర్హులు.
జీతభత్యాలు : ఈ కోర్సులో ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతంగా రూ.56,100 లభిస్తుంది. ఉద్యోగ సమయంలో అనుభవం మరియు ప్రమోషన్ల ఆధారంగా ఈ జీతం రూ.1,77,500 వరకు పెరిగే అవకాశముంది. దీనితో పాటు కేంద్ర ప్రభుత్వ వేతన ప్రమాణాల ప్రకారం DA, HRA, ట్రావెల్ అలవెన్స్, వసతి, మెడికల్ వంటి అనేక సౌకర్యాలు కూడా అందిస్తారు.
ఎంపిక విధానం :అభ్యర్థుల షార్ట్ లిస్టింగ్ (అకడమిక్ రికార్డుల ఆధారంగా), SSB ఇంటర్వ్యూ (Services Selection Board ద్వారా 5 రోజుల ప్రక్రియ), మెడికల్ పరీక్ష & ఫైనల్ మెరిట్ లిస్టు ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ముఖ్య తేదీలు : దరఖాస్తు ప్రారంభం 30 ఏప్రిల్ 2025 to చివరి తేదీ 29 మే 2025 (సాయంత్రం 03:00 గంటల వరకు మాత్రమే) ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ : ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి – https://joinindianarmy.nic.in. హోమ్ పేజీలో ఉన్న ‘Officer Entry Apply/Login’ సెక్షన్‌కి వెళ్లండి. రిజిస్ట్రేషన్ చేయండి లేదా లాగిన్ అవ్వండి. అవసరమైన వివరాలు, డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేయండి. ఫారమ్‌ను పూర్తి చేసి సబ్మిట్ చేయండి
ఇది కేవలం ఉద్యోగం కాదు. దేశానికి సేవ చేసే అరుదైన అవకాశం. ఇంజనీరింగ్ చదివిన యువతకు ఇది ఒక ప్రత్యేక అవకాశంగా నిలవనుంది. అర్హతలు కలిగిన వారు వెనుకాడకుండా దరఖాస్తు చేయండి.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🔥AP ప్రభుత్వ మెడికల్ కళాశాలలో 79 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల
🔥CBSE 10th, 12th Results 2025 : సీబీఎస్ఈ పరీక్ష 10వ, 12వ తరగతి పరీక్షా ఫలితాల పైన కీలక మార్పులు