AP Intermediate Reverification and Recounting : AP ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం పూర్తి వివరాలు 

AP Intermediate Reverification and Recounting : AP ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్‌. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ కోసం దరఖాస్తుల ఆహ్వానం పూర్తి వివరాలు 

AP Inter Result 2024 | AP Inter Reverification and Recounting latest updates in Telugu:   ఇంటర్మీడియట్ బోర్డ్ పబ్లిక్ పరీక్ష ఫలితాలు 12-04-2024న ఉదయం 11:00 గంటలకు విడుదల చేసిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షల్లో ఈ ఏడాది అత్యధిక ఉత్తీర్ణత రావడం జరిగింది. గత ఎనిమిదేళ్ల ఫలితాలతో పోల్చితే ఈసారే ఎక్కువ మంది విద్యార్థులు పాసయ్యారు. రెండు సంవత్సరాలకు కలిపి 8,55,030 మంది పరీక్షలు రాయగా   6,17,403 మంది (72%) ఉత్తీర్ణత సాధించారు. ప్రథమ సంవత్సరంలో 67%, ద్వితీయ సంవత్సరంలో 78% మంది ఉత్తీర్ణులయ్యారు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఈ నెల 24 వరకు రీకౌంటింగ్కు అవకాశం, ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని కార్యదర్శి సౌరభ్ గౌర్ కోరారు. ఈ నెల 18 నుంచి 24 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించామన్నారు. రీకౌంటింగ్కు రూ.260, రీవెరిఫికేషన్, జవాబుపత్రం నకలు కోసం ఒక్కో పేపరు రూ.1,300 చొప్పున ఫీజు చెల్లించాలి. మే 25 నుంచి జూన్ 1 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని తెలియజేయడం జరిగింది. ఈ షెడ్యూల్ను త్వరలో విడుదల చేస్తామన్నారు.

పరీక్ష సమయం – ఉదయం 9 గంటలు నుంచి మధ్యాహ్నం 12 గంటలు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు. రోజుకు రెండు విడతలుగా జరుగుతాయి. ప్రాక్టికల్ పరీక్షలు మే 1 నుంచి 4 వరకు జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తారు.

How to Check AP Intermediate Results 2024 Latest : ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్ష (AP Inter Exams) రాసిన విద్యార్థులు https://resultsbie.ap.gov.in/ సైట్ లోకి ఓపెన్ చేయండి. తరువాత హోం పేజ్ ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఏ ఇయర్ అయితే ఆ ఇయ్యరు. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ తో పాటు ఒకేషన్ ఫలితాల లింక్ ఆప్షన్లు కనిపిస్తాయి. మీకు కావాల్సిన ఆప్షన్ పై క్లిక్ చేయాలి. మీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి Submit  పై క్లిక్ చేయాలి. తరువాత మీ మార్కుల జాబితా ఓపెన్ అవుతుంది. ప్రింట్ అవుట్ లేదా Download ఆప్షన్ పై క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page