ఏపీ, తెలంగాణలో సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Supreme Court of India Junior Court Assistant Recruitment 2026 Notification Out for 250 Posts
Supreme Court of India Recruitment 2026 Latest SCI Junior Court Assistant Notification 2026 Apply Now : నిరుద్యోగులకు భారీ శుభవార్త. భారత సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ 250 ఉద్యోగముల భర్తీ కొరకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది.
Important Points
• సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ జాబ్స్.
• 250 పోస్టులు విడుదల చేసింది. నెల జీతం రూ. ₹35,400/- to ₹1,12,400/- ఇస్తారు.
• 1 సెప్టెంబర్ 2026 నాటికి వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి.
• Any డిగ్రీ ఉత్తీర్ణత, రాత పరీక్ష ద్వారా సెలక్షన్ ఉంటుంది.
• అప్లికేషన్ చివరి తేదీ 28 అక్టోబర్, 2026, రాత్రి 11.55 గంటలు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

Supreme Court of India Junior Court Assistant 250 Vacancy : భారత సుప్రీంకోర్టు లో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగులకు కోసం భారత పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. నెల జీతం పే లెవెల్ 6 : రూ. ₹35,400/- to ₹1,12,400/- మధ్యలో జీతం ఇస్తుంది. 1 సెప్టెంబర్, 2026 నాటికి వయసు 18 సం. ల నుండి 30 సం.ల మధ్య ఉండాలి. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, కంప్యూటర్ పరిజ్ఞానం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ 7 అక్టోబర్, 2026, మరియు దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ మరియు సమయం 28 అక్టోబర్, 2026, రాత్రి 11.55 గంటలు లోపు భారత సుప్రీంకోర్టు వెబ్సైట్, అనగా www.sci.gov.in ద్వారా అందించబడుతుంది. దరఖాస్తులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి.
ఖాళీలు : సుప్రీంకోర్టు లో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ నియామకాలు 250 పోస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
విద్యార్హత : భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ. కంప్యూటర్ ఆపరేషన్‌పై పరిజ్ఞానం మరియు కంప్యూటర్లో నిమిషానికి 35 పదాల టైపింగ్ వేగం.
నెల జీతం : పే లెవెల్ 6 : రూ. ₹35,400/- to ₹1,12,400/-
వయసు : 1 సెప్టెంబర్, 2026 నాటికి, అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదు. అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 30 సంవత్సరాలు. అయితే, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులు (నాన్-క్రీమీ లేయర్), శారీరక వికలాంగులు మరియు మాజీ సైనికులకు చెందిన అభ్యర్థులకు సాధారణ వయో సడలింపు వర్తిస్తుంది.
•దరఖాస్తు రుసుములు : దరఖాస్తులు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే స్వీకరించబడతాయి. తిరిగి చెల్లించబడని దరఖాస్తు రుసుము: జనరల్/రిజర్వేషన్ లేని కేటగిరీ అభ్యర్థులకు రూ.1,500/- మరియు షెడ్యూల్డ్ కులాలు/షెడ్యూల్డ్ తెగలు/ఇతర వెనుకబడిన తరగతులు (నాన్-క్రీమీ లేయర్)/మాజీ సైనికులు/శారీరకంగా వికలాంగులైన అభ్యర్థులకు రూ.750/-, అదనంగా బ్యాంక్ ఛార్జీలు. ఈ రుసుమును ఆన్లైన్ పద్ధతిలో మాత్రమే చెల్లించాలి. రుసుమును మరే ఇతర రూపంలోనూ స్వీకరించబడదు.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ లో ఎగ్జామినేషన్ సెంటర్స్ (గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, & విజయనగరం) & తెలంగాణలో (హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం & వరంగల్ ) ప్రాంతాలలో ఎగ్జామినేషన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి:- ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి రుసుము చెల్లించవలసి ఉంటుంది. దీనికి సంబంధించిన లింక్ భారత సుప్రీంకోర్టు వెబ్సైట్, అనగా www.sci.gov.in ద్వారా అందించబడుతుంది.
ముఖ్యమైన తేదీ వివరాలు
•అభ్యర్థుల ఆన్లైన్ దరఖాస్తు నమోదు ప్రారంభం తేదీ: 07/10/2026
•అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు నమోదు చేసుకోవడానికి చివరి తేదీ : 28/10/2026

🛑Notification Click Here
🛑Official Website Click Here

