Free Scooters : ఇంటర్ విద్యార్థులకు స్కూటీలు.. 1000 మందికి ప్రయోజనం, రూ.10 కోట్లు కేటాయింపు
Inter Disabled Students Scooters 2026 Latest Ts News : ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు స్కూటీలు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయం. 2026-27లో 1000 మందికి మూడు చక్రాల స్కూటీలు, రూ.10 కోట్ల కేటాయింపు.

ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదువుతున్న దివ్యాంగ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సాయం అందించేందుకు సిద్ధమవుతోంది. కళాశాలకు వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విద్యార్థులకు మూడు చక్రాల స్కూటీలను అందించాలని నిర్ణయించింది. ప్రస్తుత విద్యా సంవత్సరం 2026-27లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న 1,000 మంది దివ్యాంగ విద్యార్థులకు ఈ స్కూటీలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రభుత్వం సుమారు రూ.10 కోట్ల నిధులను కేటాయించింది.
విద్యార్థులకు అందించనున్న వాహనాలను రెట్రోఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్స్‌గా పేర్కొంటున్నారు. ఇవి అవసరాన్ని బట్టి పెట్రోల్‌తో పాటు విద్యుత్‌తో కూడా నడిచే విధంగా ఉంటాయి. స్కూటీల కోసం వచ్చే దరఖాస్తులను పరిశీలించేందుకు జిల్లా స్థాయి పరిశీలన కమిటీలు ఏర్పాటు చేయనున్నారు.
అర్హతలు, దరఖాస్తు విధానం, అవసరమైన ధ్రువపత్రాలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలను సంబంధిత అధికారులు వెల్లడించాల్సి ఉంటుంది.


