Ration Card : రేషన్ కార్డుదారులకు బిగ్ అప్డేట్.. 6 నెలలుగా రేషన్ తీసుకోలేదా? కార్డుపై కీలక అప్డేట్.. 3 నెలలు అవకాశం
Ration Card Holder 6 Months Not Used Ekyc 3 Months Update : రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక అప్డేట్ వచ్చింది. గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోని కార్డులను గుర్తించి, వాటిపై తాత్కాలికంగా రేషన్ పొందే అవకాశాన్ని నిలిపివేసే ప్రక్రియను కేంద్రం ప్రారంభించనుంది. ఈ చర్యలో భాగంగా దేశవ్యాప్తంగా సుమారు 15.8 మిలియన్ల ‘సైలెంట్ రేషన్ కార్డులు’ ఉన్నట్లు సమాచారం.
అయితే రేషన్ కార్డులను వెంటనే పూర్తిగా రద్దు చేయడం లేదు. ముందుగా వాటిని తాత్కాలికంగా డిసిబుల్ చేస్తారు. ఆ తర్వాత సంబంధిత కార్డుదారులకు తమ అర్హతను నిరూపించుకునేందుకు మూడు నెలల సమయం ఇవ్వనున్నారు.

మూడు నెలల్లో e-KYC పూర్తి చేయాలి : తాత్కాలికంగా డిసేబుల్ చేసిన రేషన్ కార్డుదారులు నిర్ణయించిన వ్యవధిలో e-KYC పూర్తి చేస్తే వారి కార్డును మళ్లీ యాక్టివ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆరు నెలలుగా రేషన్ తీసుకోలేదనే కారణంతో వెంటనే శాశ్వతంగా కార్డు తొలగించబడదు.
కేంద్రం ఈ ప్రక్రియను PDS డేటాబేస్ను శుభ్రపరచడంలో భాగంగా చేపడుతోంది. డూప్లికేట్ కార్డులు, మరణించిన వ్యక్తుల పేర్లు, వలస వెళ్లినవారు లేదా అర్హత లేని లబ్ధిదారుల వివరాలను గుర్తించి వ్యవస్థను మరింత కచ్చితంగా మార్చడం దీని ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది.
అక్టోబర్ 1 నుంచి కొత్త విధానం : అధికారిక సమాచారం ప్రకారం ‘సైలెంట్ రేషన్ కార్డులు’ మరియు డూప్లికేట్ లబ్ధిదారుల విషయంలో తాత్కాలిక డిసేబుల్, ఆ తర్వాత మూడు నెలల e-KYC రీవాలిడేషన్ విధానం 2026 అక్టోబర్ 1 నుంచి SMART-PDSలో అమల్లోకి రానుంది. ప్రస్తుతం కూడా రేషన్ కార్డుదారుల e-KYC ప్రక్రియ కొనసాగుతోంది. 2026 జూలై 30 నాటికి దేశవ్యాప్తంగా e-KYC కవరేజ్ 90.64 శాతంగా ఉందని కేంద్ర ఆహార శాఖ తెలిపింది.

రేషన్ కార్డుదారులు ఏం చేయాలి? మీ కుటుంబం గత కొన్ని నెలలుగా రేషన్ తీసుకోకపోయినా, కార్డు నిజమైనదే అయితే నిర్లక్ష్యం చేయకుండా e-KYC స్థితిని ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. e-KYC అవసరం ఉంటే సమీపంలోని రేషన్ దుకాణం లేదా సంబంధిత అధికారిక వ్యవస్థ ద్వారా ప్రక్రియను పూర్తి చేయాలి. నిర్ణయించిన మూడు నెలల వ్యవధిలో అర్హతను నిర్ధారించుకోగలిగితే తాత్కాలికంగా డిసేబుల్ చేసిన కార్డును తిరిగి యాక్టివ్ చేసే అవకాశం ఉంటుంది.

