మహిళలకు శుభవార్త.. ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం సీఎం |APSRTC AC New Electric buses Free travel for women 2026
APSRTC AC New Electric buses Free travel for women 2026 : ఆంధ్రప్రదేశ్ లో APSRTC ప్రజలకు శుభవార్త తెలిపారు.కేంద్ర ప్రభుత్వం సహకారంతో పిఎం ఈ బస్సు సేవ పథకం ద్వారా 1050 ఎలక్ట్రానిక్ బస్సులు రోడ్లపైకి తీసుకురానున్నది.

రాష్ట్రంలోని మహిళలకు సీఎం చంద్రబాబు గారు మరో శుభవార్త తెలిపారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో భారీ ఎత్తున కొత్తగా ఏసి బస్సులు అందుబాటులో తీసుకురానన్నారు. ఈ బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం సదుపాయని కల్పిస్తామని సభలో హామీ ఇచ్చారు. ఈ ఎలక్ట్రిక్ బస్సులు మహిళలు నడపవలసి వస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమైన ప్రాంతాలలో ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి. అందులో ముఖ్యంగా విశాఖపట్టణం, తిరుపతి, విజయవాడ, అమరావతి, గుంటూరు, కర్నూలు, కడప & నెల్లూరు వంటి ప్రధాన నగరాలలో మొదట ప్రవేశపెట్టిన అన్నారు. కాలుష్యం నియంత్రణ తగ్గించేందుకు ప్రజలలో ఈ వెహికల్ వాహనాలు వాడకం కూడా పెరగాలని కేంద్ర ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది.
మొగల్తూరులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు గారు మాట్లాడుతూ అభివృద్ధితోపాటు సంక్షేమం ముఖ్యంగా అయినా పేర్కొన్నారు. ప్రజలకు సంక్షేమ పాలన ఇస్తామని హామీ ఇచ్చాం గతం లో ఎన్నికలు ప్రజలు ఏకపక్షంగా విజయాన్ని అందించారు. రెండు సంవత్సరాలలో రూ. 1.50 కోట్ల సంక్షేమం కోసం ఖర్చు చేస్తామని తెలిపారు. మెగా డీఎస్సీ ని అడ్డుకునేందుకు ఎన్నో కుట్రలు చేశారని చేసిన అడ్డుకునేందుకు 350 కేసులు వేసారని తెలిపారు. ఆడబిడ్డలకు దీపం పథకం పెట్టి సంవత్సరంలో 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చారు. ఇప్పటివరకు పెన్షన్ రూపంలో రూ.73 వేల కోట్ల ఇచ్చామని తెలిపారు.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున ఎలక్ట్రికల్ ఏసీ వెహికల్ రానన్నాయి. అందులో కూడా మహిళలకు ఉచితంగా ప్రయాణం కల్పిస్తున్న హామీ ఇచ్చారు. డిసెంబర్ లోగా ఈ ఎలక్ట్రిక్ బస్సులు రోడ్డుపైకి రానున్నాయి.


