తపాల శాఖలో కొలువుల జాతర 23757 పోస్టులు భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం
India Postal GDS Registration Begins For Filling 23757 Posts : తపాలా శాఖలో గ్రామీణ డాక్ సేవక్ (GDS) పోస్టుల భర్తీకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమైంది.

దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు కేవలం 10వ తరగతి మెరిట్ ఆధారంగా ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ పోస్టల్ సర్కిలలో ఖాళీగా ఉన్న గ్రామీణ డాక్ సేవక్ (GDS), బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ & అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్మాస్టర్ భర్తీకి 2026 ఆగస్టు నా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 23,757 ఖాళీలు అయితే ఉన్నాయి. ఈరోజు నుంచే దరఖాస్తు రిజిస్ట్రేషన్ ప్రారంభం. ఈ ఉద్యోగులకు గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు, స్థానిక భాష చదవడం రాయడం వచ్చినా చాలు, అలాగే కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి. వయసు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉండాలి. వయోపరిమితి సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు పదో తరగతి మార్క్స్ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.
దేశవ్యాప్తంగా 23,757 పోస్టల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసినదే. అందులో ఆంధ్రప్రదేశ్ లో 918 ఉద్యోగాలు తెలంగాణలో 419 ఖాళీలు అయితే ఉన్నాయి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగాలకు నెలకు రూ.12,000 నుంచి రూ.29,380 మధ్యలో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ డాక్ సేవకు ఉద్యోగాలకు రూ.10 వేల నుంచి రూ.24, 470 మధ్యలో జీతం ఇస్తారు. ముఖ్యంగా రాత పరీక్ష లేకుండా టెన్త్ మార్క్స్ ఆధారంగా సెలక్షన్ చేస్తారు. మ్యాథ్స్, ఇంగ్లీషు & లోకల్ లాంగ్వేజ్ తప్పనిసరిగా ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ తో పాటు సైకిల్ తొక్కడం రావాలి. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 19 వరకు రిజిస్ట్రేషన్ కొనసాగుతుంది.
ఇండియన్ పోస్టల్ (GDS) ఉద్యోగాలకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి : అర్హత కలిగిన మరియు ఆసక్తికరమైన అభ్యర్థులు ఇండియన్ పోస్టల్ ఉద్యోగాల కోసం అధికార వెబ్సైట్ https://indiapost.gov.in/ నుంచి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్ లో రాష్ట్రము మరియు జిల్లా వారిగా కాలి వివరాలైతే ఉన్నాయి.


