Bank Holidays 2026 : వినియోగదారులకు అలర్ట్.. సెప్టెంబర్ నెలలో 14 రోజులు బ్యాంకు సెలవు
Bank holiday September month 2026 Latest News : ఖాతాదారులకు అలర్ట్..రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ప్రకారము సెప్టెంబర్ లో బ్యాంకులకు 14 రోజుల బంద్.. ఎప్పుడు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం..

డిజిటల్ బ్యాంకింగ్ సేవలు ఉన్నప్పటికీ.. ఇప్పటికీ చాలామంది బ్యాంకుకు వెళ్లి ఖాతాదారుల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. బ్యాంకుకు వెళ్లి ఏదైనా పనులు చేసుకోవాలన్న ఖాతాదారులకు బ్యాంకు క్యాలెండర్ ప్రకారం ఎప్పుడు లీవ్ అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా సెప్టెంబర్ 4వ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా బ్యాంకు సెలవు ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 5వ తేదీన ఉపాధ్యాయ దినోత్సవం గా బ్యాంకు సెలవు లేదు. సెప్టెంబర్ 14న గణేష్ చతుర్థి కారణంగా సెలవు ఉంటుంది. సెప్టెంబర్ నెలలో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో మొత్తం 14 రోజులు సెలవులు ఉన్నాయి అందులో ముఖ్యంగా. ఆదివారము, రెండో శనివారము, శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి వంటి పండుగలతో సెలవులు ఉన్నాయి. ఆర్బిఐ క్యాలెండర్ ప్రకారం, ఆదివారాలు, రెండు నాలుగు శనివారాలు మొత్తం కలిపి 6 రోజులు బ్యాంకు సెలవు ఉంది.
ఉద్యోగ సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెకు ఈ నెల చివరిలో పిలుపునిస్తున్నారు. వారి యొక్క డిమాండ్లు సఫలం కాకపోతే చివరి వారంలో 5 రోజుల పాటు బ్యాంకు లావాదేవీలలో తీవ్ర ఇబ్బందులు కలిగే అవకాశాలున్నాయి. యూపీఐ, ఆన్లైన్ బ్యాంకింగ్ యధావిధిగా కొనసాగుతుందని ఆర్బిఐ వెల్లడించారు. అన్నీ కలిపితే సెప్టెంబర్ నెలలో బ్యాంకులకు 14 రోజులు బంద్ ఉండే అవకాశం ఉంది.


