AP Ration : ఏపీలో రేషన్ సరుకులకి బదులుగా.. డబ్బులు.
AP Ration card CBDC Cash Transfer : ఆంధ్రప్రదేశ్ లో రేషన్ దారులకు శుభవార్త.. రేషన్ సరుకులు బదులు..డబ్బులు ఇచ్చేందుకు కొత్త పద్ధతిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకురానున్నది. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ద్వారా డైరెక్ట్ గా నగదు బ్యాంక్ అకౌంట్ లో జమ చేసేందుకు సలహాలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ రేషన్ షాపులో సరుకులు తీసుకోవడం, మీకు ఇష్టం లేదా అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరుకులు బదులు..డబ్బులు ఇస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇలాంటి కొత్త విధానాన్ని తీసుకొస్తుంది.. రేషన్ బియ్యం అక్రమ రవాణా అను నియంత్రించేందుకు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) విధానాన్ని రేషన్ డిపో అమలు చేయాలని సివిల్ సర్వీస్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. దీన్ని మొదటి దశలో ఇంప్లిమెంట్ చేయడానికి విశాఖపట్నం జిల్లాను ప్రయోజనాత్మక ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.
ఏపీలో రేషన్ సరుకులకి బదులుగా డబ్బులు.. అసలు ఇది ఎలా పని చేస్తుందంటే, ఒక్క లబ్ధిదారునికి లెక్క ప్రకారం నెలకు రావాల్సిన రేషన్, రైస్ కావాలంటే రేషన్ డిపో కి వెళ్లి తీసుకుంటాం. కానీ రేషన్ సరుకులు వద్దనుకుంటే బియ్యం కోటాకు సమానమైన మొత్తాన్ని సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (CBDC) ద్వారా నేరుగా లబ్ధిదారని బ్యాంకు అకౌంట్ లో నగదు జమ చేసేందుకు ప్రభుత్వం పరిశీలిస్తుంది. అంటే బియ్యం తీసుకోను అంటే దాని విలువ డబ్బు రూపంలో పొందే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో విశాఖ జిల్లాలో 5,28,000 ఆపై రేషన్ కార్డులు ఉన్నాయి. అందులో 1,54,000 కార్డులు ఎనప్సీ కార్డులు, అంటే ఈ రేషన్ కార్డుదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి రేషన్ వస్తుంది. ముందుగా 1,54,000 మందికి ఈ విధానాన్ని ఇంప్లిమెంట్ చేసి అది సక్సెస్ అయితే మిగిలిన అందరికీ ఇస్తారు. ప్రస్తుతం గుజరాత్ లో ఇంప్లిమెంట్ అవుతున్న ఈ పథకాన్ని ఏపీలో కూడా ఇంప్లిమెంట్ చేయడానికి అధికారుల మోడల్ ని పరిశీలిస్తున్నారు. ఇక్కడ రేషన్ బియ్యం అక్రమాలను అడ్డుకునేందుకు అసలు టార్గెట్. రేషన్ లబ్ధిదారునికి పొందకుండా బ్లాక్ మార్కెట్లోకి వెళుతుంది, ఆక్రమణ అరికట్టేందుకే ఈ పద్ధతిని తీసుకొస్తున్నారు. కానీ ఈ డిజిటల్ క్యాష్ రూపంలో చేయడం ద్వారా రేషన్ అక్రమాల నుంచి నివారించవచ్చుని ప్రభుత్వం భావిస్తుంది.


