ఏపీ లో కొత్త పింఛనుదారులకు బంపర్ గుడ్ న్యూస్ : సెప్టెంబర్ నుంచి…కొత్త దరఖాస్తులు.. ఎలా చేసుకోవాలంటే? NTR Bharosa Pension New Registration
AP NTR Bharosa Pension New Registrations 2026 Date : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు లక్షల మందికి కొత్త పెన్షన్.. ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే?

• ఏపీలో కొత్త పెన్షన్ సంబంధించి కీలక ప్రకటన.
•సెప్టెంబర్ రెండో వారం నుంచి దరఖాస్తులు ఆహ్వానం
•మొత్తం మూడు లక్షల మందికి కొత్త పెన్షన్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో సెప్టెంబర్ రెండో వారం నుంచి మరో మూడు లక్షల మందికి కొత్త పెన్షన్ ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. ముఖ్యంగా సెప్టెంబర్ రెండవ వారం నుంచి వితంతువులు వృద్ధులు చేనేత దివ్యాంగులు గీత కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హులైన అభ్యర్థులు స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయంలో లేదా https://sspensions.ap.gov.in/ లో ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇందుకుగాను ముఖ్యంగా అభ్యర్థుల ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, ఇన్కమ్ సర్టిఫికెట్ తో పాటు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు అటాచ్ చేయవలసి ఉంటుంది.
సెప్టెంబర్ లో మీరు అప్లై చేసుకుంటే అన్నీ పరిశీలించి అక్టోబర్ నెల నుంచి మీకు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా వితంతువులకు, వృద్ధులకు పెన్షన్ ఇచ్చేందుకు కార్యాచరణ చేపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ వారం రోజులుగా కొత్త పెన్షన్ కసరత్తు చేస్తున్నారు. తొలి విడుదలకు మంజూరు చేసిన తర్వాత మిగిలినవి కేటగిరి వారిగా విడుదల చేయనున్నారు.

ఏపీ పెన్షన్ కు కావలసిన డాక్యుమెంట్ వివరాలు ముఖ్యంగా ఆధార్ కార్డు, రేషన్ కార్డ్, వితంతువు అయితే భర్త మరణించిన సర్టిఫికెట్, దివ్యాంగులు అయితే సదన్ సర్టిఫికెట్, క్యాస్ట్ సర్టిఫికెట్ డాక్యుమెంట్స్ తీసుకొని అర్హులైన అభ్యర్థులు స్వర్ణ గ్రామ వార్డు కార్యాలయంలో లేదా https://sspensions.ap.gov.in/ వెబ్సైట్లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై డేట్ ఇంకా రాలేదు.

