Aadhaar Card 2026 : ఆధార్ కార్డులో పేరు, అడ్రసు, ఫోటో, మొబైల్ నెంబరు ఎన్నిసార్లు అప్డేట్ చేసుకోవచ్చు
How many times can you update your name, address, photo, and mobile number in your Aadhaar card 2026 : దేశవ్యాప్తంగా ఇప్పుడు ఏ పనికైనా ఆధార్ కార్డు ముఖ్యమైంది ముఖ్యంగా బ్యాంకు కథ ఓపెన్ చేయాలన్నా సంక్షేమ పథకాలు పొందాలన్నా అలా ఏదానికైనా ఆధార్ కార్డు సమర్పించవలసి ఉంటుంది. అయితే అందులో ఆధార్ కార్డులో పేరు, అడ్రసు, ఫోటో, మొబైల్ నెంబరు ఎన్ని సార్లు అప్డేట్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

చాలామందిలో ఆధార్ కార్డులో పేరు తప్పుగా నమోదయి ఉండొచ్చు, అలానే పెళ్లయిన వారు అత్తారింటికి వెళ్తారు. అప్పుడు వారు కూడా ఇంటి పేరు మార్చుకోవాల్సి వస్తుంది. ఆధార్ కార్డులో పేరు మార్చుకోవడానికి పరిమితులు ఉన్నాయా. పేరు అప్డేట్ చేసుకునేటప్పుడు జాగ్రత్త వహించాలి లేదంటే ఇబ్బందులు పడతారు. UIDAI నిబంధనల ప్రకారం ఆధార్ కార్డుల పేరు కేవలం రెండుసార్లు మాత్రమే అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంతకుమించి అప్డేట్ చేయడానికి వీలు లేదు.
మీరు ఆధార్ కార్డులో పేరు అప్డేట్ చేసుకోవడానికి కొన్ని పత్రాలు సమర్పించుకోవాల్సి వస్తుంది. పేరులో తప్పు ఉన్నట్లయితే మీ టెన్త్ క్లాస్ మార్క్ లిస్ట్ సమర్పించాలి, లేదా డేట్ అఫ్ బర్త్ సర్టిఫికెట్ సమర్పిస్తే సరిపోతుంది. ఇంకా ఇంటి పేరు మార్చుకోవాలంటే మీ మ్యారేజ్ సర్టిఫికెట్ సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఇకపోతే ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవచ్చు. ఇందుకుగాను ఇలాంటి పరిమితులు లేవు ఎన్నిసార్లైనా సరైన పత్రాలు సమర్పించి ఆధార్ లో డేట్ అఫ్ బర్త్ అప్డేట్ చేసుకోవచ్చు.
ఇకపోతే ఆధార్ కార్డు లో జండర్ ను కూడా మార్చుకోవచ్చు. ఒక ఆధార్ కార్డులో ఒకసారి మాత్రమే జెండర్ మార్చుకోవడానికి అవకాశం కల్పిస్తుంది. ఆధార్ కార్డులో అడ్రస్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా ఆధార్ అడ్రస్ ను అప్డేట్ చేసుకోవచ్చు పరిమితులు లేవు. ఇకపోతే ఫోన్ నెంబర్ కూడా ఎన్నిసార్లు అయినా ఆధార్ లో అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ ఫోటో కూడా ఎన్నిసార్లు అయినా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ అప్డేట్ కి సంబంధించి కొన్ని ఫ్రీ సర్వీసులు ఉన్నాయి.

మీరు ఆన్లైన్ ద్వారా లేదా ఆధార్ యాప్ అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార్ యాప్ ద్వారా ఫోన్ నెంబర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు. అలాగే ఆధార యాప్ ద్వారా ఈమెయిల్ ఐడి కూడా అప్డేట్ చేసుకోవచ్చు అది కూడా ఫ్రీగానే. ప్రస్తుతం బయోమెట్రిక్ తీసుకుంటున్నారు ఐదు సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల మధ్యలో ఉన్న పిల్లలకు బయోమెట్రిక్ ఆధార్ ఫ్రీగా అప్డేట్ చేస్తున్నారు. పిల్లలకి 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఆధార్ అప్డేట్ తప్పనిసరి చేయాలి. అలాగే సాధారణంగా అభ్యర్థులు పది సంవత్సరాలకు ఒకసారి ఆధార్ అప్డేట్ చేసుకుంటే సరిపోతుంది.

