సన్న వరి సాగు రైతులకు శుభవార్త.. 500 రూపాయలు బోనస్ ఆన్లైన్లో తప్పనిసరిగా నమోదు చేసుకోండి | Farmers Cultivating
Farmers Cultivating Fine Grain Paddy to Receive The Rs 500 Bonus.. Registration Online : సన్న వరి సాగు రైతులకు ప్రభుత్వం గుర్తించిన 7 రకాల వరికి రైతులకు క్వింటాకు 500 చొప్పున బోనస్ అందజేయనున్నది. తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి గారు చందా భూమి రెడ్డి గారు స్పష్టం చేశారు.

వానాకాలం 2026 సీజన్లో తెలంగాణ ప్రభుత్వం గుర్తించిన 7 రకాల సన్న వరి సాగు చేస్తున్న రైతులకు కింటాకు 500 చొప్పున బోనస్ అందజేయాలని తమ సాగు వివరాలను తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి స్పష్టం చేశారు. నమోదు ప్రక్రియకు సంబంధించి విధివిధానాలు విడుదల చేశారు. కొనుగోలు చేసే గుర్తింపు పొందిన ఫర్టిలైజర్ డీలర్ వద్ద విత్తనాలు తీసుకున్న రైతు వివరాలను నేరుగా ఆన్లైన్లో నమోదు చేయాలి. లేదంటే సొంత విత్తనాలు వాడిన రైతులు తమ సొంత వడ్లే వాడినట్లు స్వయం దృవీకరణ పత్రాన్ని ఫిల్ అప్ చేసి వ్యవసాయ విత్తన అధికారిని సంప్రదించి ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలి. లేదా యూనివర్సిటీ సీడ్ ప్లాంట్లు నుంచి వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు, తమ రసీదును జిరాక్స్ తో పాటు స్వయంకృకరించిన పత్రాలు జత చేసి ఏఈవో ద్వారా నమోదు చేసుకోవాలి.
వరి సాగు వివరాలు నమోదు చేయడానికి చివరి తేదీ 10 సెప్టెంబర్ 2026 లోపల చేసుకోవాలని ఏవో తెలిపారు. ఆన్లైన్ ప్రక్రియ ముగిసిన వెంటనే రైతులకు తుది జాబితా ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయంలో లిస్ట్ ఉంటుంది. అర్హత కలిగిన రైతులందరూ గడువు లోపలే నమోదు చేసుకోవాలని సూచిస్తున్నారు. అలా నమోదు చేసుకున్న ఏడు రకాల గుర్తించిన ఏడు రకాల సన్నబరి సాగు చేస్తున్న రైతులకు కింటాకు 500 చొప్పున బోనస్ అందుతుంది.


