ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త.. ఇకపై వారికి బ్యాంకు అకౌంట్ లోకి డైరెక్ట్ గా పెన్షన్ డబ్బులు.. AP Disabled Students Pension NTR Bharosa Pension
AP Disabled Students Pension amount Direct Transferred to Bank Accounts : ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు శుభవార్త.. AP ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులకు అందించే సామాజిక భద్రత పింఛను నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం 2, 3 నెలల్లో అమలులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇంటికి దూరంగా ఉండి వసతిగృహాలు, గురుకులాల్లో చదువుకునే దివ్యాంగ విద్యార్థులకు పెన్షన్ కోసం ప్రతినెల ఇంటికి రావాల్సి వస్తుంది. ఈ సమస్యలను అధిగమించేందుకే ఈ కొత్త ఆలోచన చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు గారు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ లో ఇంటికి దూరంగా వసతి గృహాలు, గురుకులలో చదువుకుంటున్న సామాజిక భద్రత పెన్షన్ తీసుకుంటున్న దివ్యాంగుల విద్యార్థులకు ఎదుర్కొన్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పెన్షన్లు నగదు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో జమ చేస్తున్న నిర్ణయం తీసుకుంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రాథమికంగా ఆమోదం తెలిపారు. దివ్యాంగ విద్యార్థులు ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తీసుకునేందుకు ప్రతినెల సెలవు పెట్టి ఇళ్లకు వెళ్తున్నారు. ఇలా పోవడం వల్ల తరగతులు నష్టంతో పాటు, ప్రయాణంలో ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2, 3 నెలలు దివ్యాంగ విద్యార్థులకు ఖాతాలలో నేరుగా పింఛను డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేసేందుకు చర్యలు తీసుకోమన్నారు.
ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 7.50 లక్షల మంది దివ్యాంగుల కోటా ప్రతినెల సామాజిక భద్రత పింఛన్లు తీసుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. ఇందులో వయసుతో సంబంధం లేకుండా 45% వైకల్యం పైబడిన వారికి వివిధ విభాగాలలో రూ.6,000/- నుంచి రూ.15,000/- వరకు ప్రభుత్వం పెన్షన్ ఇస్తున్నారు. అన్ని రకాల ప్రభుత్వ గురుకులలు, వసతి గృహాలలో రెసిడెన్సెస్ లో విభాగాలలో చదివే దివ్యాంగ విద్యార్థులు 1435 మంది ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. రెసిడెన్సి విధానాలలో ప్రవేట్ విద్యార్థులలో చదివే పింఛ నుకు అర్హులైన దివ్యాంగ విద్యార్థులకు కూడా లెక్కలోకి తీసుకున్నట్లు పదివేల మంది వరకు ఉంటారని అంచనా, మానసిక వైఖలం ఉన్నవారికి బ్యాంకు ఖాతాకు నేరుగా పెన్షన్ చేసే విత్ డ్రా చేసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అవన్నీ దృష్టిలో పెట్టుకొని తుది నిర్ణయం తీసుకోవాలని తెలుపుతున్నారు.


