ఏపీ లో ఉచితంగా 3 సిలిండర్ పథకంపై.. మహిళలకు గుడ్ న్యూస్.. బుకింగ్ తో సంబంధం లేకుండా దీపం 2 నిధులు | AP Deepam 2 Scheme
Andhra Pradesh Deepam 2 Scheme 2026 Subsidy Update : ఆంధ్రప్రదేశ్ లో దీపం 2 పథకం ద్వారా బుకింగ్ తో సంబంధం లేకుండా డైరెక్ట్ గా లబ్ధిదారుల ఖాతాలో నిధులు జమ చేయనన్నారు.

దీపం 2 పథకం పై లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలియజేశారు.. ఈ పథకం కింద సంవత్సరంలో మూడు సిలిండర్లు ఉచితం అందిస్తున్న మహిళలకు ముందుగా వాటి డబ్బులు చెల్లించవలసి ఆ తర్వాత రీయింబర్స్ వస్తూ ఉండేది. కానీ ఇంక పై బుకింగ్ తో సంబంధం లేకుండా నాలుగు నెలలకు ఒకసారి లబ్ధిదారుల అకౌంట్లో నిధులు జమ చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిన్న క్యాబినెట్లో సూచించారు. ఇంక పై మహిళలకు ఎప్పుడు గ్యాస్ బుకింగ్ చేసుకోవాలన్న సమస్యలు ఉండమన్నారు. పథకం కింద 95.59 లక్షల మందికి లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం టు పథకంపై కీలక నిర్ణయం తీసుకున్నారు ఇకపై ప్రతి నాలుగు నెలలకు ఒకసారి డబ్బులు డైరెక్ట్ గా లబ్ధిదారి ఖాతాలో ఇవ్వనన్నారు. ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. లబ్ధిదారులు ముందుగా డబ్బులు చెల్లించి సిలిండర్ కొనుగోలు చేస్తారు ఆ తర్వాత ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేయాలన్నది. అయితే ఇకపై అలా కాకుండా లబ్ధిదారులకు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకోవాలనే సంబంధం లేకుండా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి బ్యాంకు అకౌంట్లో సబ్సిడీ డబ్బులు జమ చేయాలని క్యాబినెట్లో నిర్ణయించుకున్నారు. మహిళలకు ఇబ్బంది లేకుండా చేసేందుకే నిర్ణయం తీసుకున్నారు.
ఈ పథకానికి దరఖాస్తు చేసుకోనుకున్న అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన శాశ్వత నివాసం అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో తెల్ల రేషన్ కార్డు, దారిద్య రేఖకు (BPL) దిగువ ఉండాలి. మహిళల వయసు 18 సంవత్సరాల పైబడి ఉండాలి, కుటుంబంలో ఎవరికీ ఇంతకుముందు గ్యాస్ కనెక్షన్ ఉండకూడదు వంటి నిబంధనలు ఉన్నాయి. పథకం కింద అర్హత కలిగిన ఏడాదికి మూడు సిలిండర్ ఉచితంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఇస్తుంది.


