AP రాష్ట్రంలో మరో కొత్త పథకం.. ఏడాదికి ఒక్కొక్కరికీ 25 వేల చొప్పున ఆర్థిక సహాయం.. పూర్తి వివరాలు ఇవే | AP Netannala Sevalo scheme 2026
AP Netannala Sevalo scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ లో ప్రజలకు మరొక గుడ్ న్యూస్.. ఆంధ్రప్రదేశ్లో చేనేత కార్మికులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ సొంత మగ్గముండి చాలు, వయసుతో సంబంధం లేకుండా నేతన్నల సేవలో పథకానికి సంబంధించి ఎంపిక పూర్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 51,952 మంది లబ్ధిదారులున్నట్లు ప్రభుత్వం గుర్తించినట్టు, సొంత మగ్గం ఉన్న కార్మికులకు ఈ పథకం వర్తిస్తుందని, అలాగే వయసుతో సంబంధం లేకుండా దారిద్ర రేఖకు దిగువుగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నేతన్నల సేవలో సంవత్సరానికి 25 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలని, జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆగస్టు 7న ఈ పథకాన్ని అమలులోకి తీసుకురానన్నారు. ఏటా రూ.120 కోట్ల ఆర్థిక శాఖ ఆమోదం కూడా ఇచ్చారు. గత ప్రభుత్వంలో చేనేత నేస్తం కింద సంవత్సరానికి 24,000 చొప్పున అందించారు, అలాగే 50 ఏళ్ల దాటిన చేనేత కార్మికులకు సామాజిక భద్రత పింఛను పంపిణీ చేస్తున్నట్లయితే వారికి చేనేత అన్వేస్తం పథకాన్ని వర్తించదని ఇవ్వలేదు. ఒకరికి ఒక పథకం లబ్ధి ఉన్న విధానాన్ని పాటించారు. దీంతో చాలామందికి అనర్హులుగా ఈ పథకం ప్రయోజనం పొందలేదు, అలా కాకూడదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబునాయుడు గారు శ్రద్ధ తీసుకొని ఇతర పథకాలు అమలైనట్లే వయసుతో సంబంధం లేకుండా సొంత మగ్గం ఉండి చేనేత వృత్తిలో ఉన్న ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో నేతన్నల సేవ పథకానికి రాయలసీమలో అర్హులు ఎక్కువ ఉన్నట్లు శ్రీ సత్య సాయి జిల్లాలో అత్యధికంగా ఉన్నారని బాపట్ల, అనంతపురం జిల్లాలలో తదితర స్థాయిలో ఉన్నారని తెలుస్తుంది. అయితే ఈ జిల్లాలో కూడా లబ్ధిదారుల సంఖ్య పదివేలకు మించలేదు. జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా ఆగస్టు 7వ తేదీన ఈ పథకం అమలు చేస్తారని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలిపారు.

