Talliki Vandanam : ఈనెల 22న తల్లికి వందనం స్కీం కింద ఒక్కొక్క విద్యార్థికి.. రూ.13వేలు జమ.. రావాలంటే.. ఇలా చేయండి
Talliki Vandanam 2026 Scheme Latest Release Date : ఆంధ్రప్రదేశ్లో తల్లికి వందనం స్కీం పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బిగ్ అప్డేట్ ఇచ్చింది. ఈనెల 22న విద్యార్థులకు తల్లికి వందనం తల్లుల ఖాతాలో రూ.13,000/- డబ్బులు జమ చేసేందుకు జీవో విడుదల చేశారు. రూ.2,000/- పాఠశాల నిర్వహణ ఖర్చులకు ఉపయోగిస్తారు. ఈ పథకం ద్వారా ఒకటి నుంచి 12వ తరగతి విద్యార్థులకు వర్తిస్తుంది. 2026-27 సంవత్సరానికి గాను 67,47,190 మంది విద్యార్థులకు లబ్ధి కలుగుతుందని పేర్కొన్నారు. 42,70,802 మంది తల్లుల ఖాతాలలో 10,120.78 కోట్ల డబ్బులను జమ చేయనున్నారు. ఈ స్కీమ్ కింద అర్హత కలిగిన ఒక్కొక్క విద్యార్థికి రూ. 13 వేల రూపాయలు తల్లుల ఖాతాలో డబ్బులు జమ కానన్నాయి.

ఈ నెల 24న మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఆలోగే ఈనెల 22వ తేదీన తల్లికి వందనం పథకం కింద విద్యార్థికి 13000 చొప్పున తల్లి ఖాతాలో నిధులు జమ చేసేందుకు ప్రభుత్వం జీవో విడుదల చేశారు. ఈ స్కీము కు సంబంధించి తొలి విడుదలలో 10,120.78 కోట్ల నిధులు విడుదల చేయనున్నారు. అలాగే కొత్తగా బడుల్లో చేరిన వారికి రెండో విడుదలలో నిధులు విడుదల చేస్తారని సమాచారం. మెగా PTM తో సంబంధం లేకుండా అంతకన్నా ముందే అర్హత కలిగిన విద్యార్థుల తల్లుల అకౌంట్లో 13,000/- చొప్పున జమ చేసేందుకు ఆదేశాలు జారీ చేశారు.
ఈనెల 22వ తేదీలలో తల్లికి వందనం నిధులు ప్రభుత్వం విడుదల చేయనున్నది. విద్యార్థుల తల్లుల ఖాతాలో 13 ఏళ్ల చొప్పున జమ చేయనున్నది ఈ స్కీం మీకు ఎలిజిబుల్ ఉందో లేదా https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout ఈ లింకు ద్వారా ఈజీగా చెక్ చేసుకోవచ్చు. ఈ పథకం మీరు డబ్బులు అందాలంటే తప్పకుండా తల్లి యొక్క ఆధార్ కార్డు తో బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. అలాగే ఈకే వేసి పూర్తి చేసి ఉండాలి. NPCI మ్యాపింగ్ కూడా ఉండాలి. స్వర్ణ గ్రామం స్వర్ణ వార్డు కార్యాలయాలలో కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ ను సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి.


