AP Government : వారి అకౌంట్ కి 20,000 జమ ఉత్తర్వులు జారీ.. చెక్ చేసుకున్నారా.. AP Matsyakarula Sevalo Scheme 2026
AP Matsyakarula Sevalo Scheme 2026 balance persons 20,000/- Releases : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. గత నెల మత్స్యకారుల సేవలు స్కీం కింద 1,30,000 లక్షల కుటుంబాలకు ప్రభుత్వం రూ.262 కోట్ల రూపాయలు విడుదల చేసిన సంగతి తెలిసినదే. అయితే పలు కారణాల వల్ల దాదాపుగా 6000 మందికి డబ్బులు అందలేదు. అందనవారి అందరికీ కూడా 20వేల చొప్పున విడుదల చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే అర్హత ఉండి అన్నదాత సుఖీభవ నిధులు చమకాని వారికి కూడా స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయాలలో సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక రకాల సంక్షేమ పథకాల అమలు చేస్తున్న విషయం తెలిసినదే. ఈ నెలలో తల్లికి వందనం నిధులు జమ చేయనుండగా తాజాగా మరో పథకం నిధులు కూడా విడుదల చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. తల్లికి వందనం పథకం ద్వారా 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థుల తల్లి యొక్క ఖాతాలో 13,000 ఈనెల 16, 17, 18వ తేదీన అమౌంట్ జమ చేయనున్నది అలాగే తాజాగా మత్స్యకారుల సేవలో పథకం కింద లబ్ధిదారులకు ఆర్థిక సహాయం విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఒక్కొక్కరి అకౌంట్లో 20,000 జమ చేసింది మే నెలలో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి మండలంలో తుమ్మల పెంటలో జరిగిన కార్యక్రమంలో నిధులు సీఎం చంద్రబాబు గారు విడుదల చేశారు. కొంతమందికి సాంకేతిక కారణాలవల్ల గతంలో నిధులు జమ కాలేదు. వారికోసం తాజాగా 5910 మందికి రిలీజ్ చేయడంతో మొత్తం 134298 మంది లబ్ధి చేకూరినది.

15 ఏప్రిల్ తేదీ నుంచి 14 జూన్ 2026 తేదీ వరకు రెండు నెలల పాటు సముద్రంలో చేపల వేట నిషేధం ఉండడంతో మత్స్యకారులోకి అండగా నిలవాలని ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారికి సంక్షేమ ప్రాధాన్యత ఇస్తూ ఈ పథకం అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం తెలిపారు. ఇంకా అర్హత ఉండి మత్స్యకారులు అకౌంట్ లో 20000 పడినట్లయితే స్వర్ణ గ్రామ స్వర్ణ అవార్డు సచివాలయాలలో తప్పనిసరిగా సంప్రదించి, వాళ్ళకి తెలియజేసినట్లయితే వెంటనే మీకు డబ్బులు వస్తాయి.

