ఈ రెండు పనులు చేయకపోతే…తల్లికి వందనం డబ్బులు కట్.. ఏపీ ప్రభుత్వం లాస్ట్ ఛాన్స్ | Complete These 2 Steps To Get Talliki Vandanam
Complete These 2 Steps To Get Talliki Vandanam Benefits | Talliki Vandanam Scheme 2026 Latest News : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం నిధులు జమాపై తేదీని ఖరారు చేశారు. జూలై 16, 17, 18 తేదీలలో తల్లికి ఖాతాల్లో డబ్బులు జమ కానున్నాయి. ఈ రెండు పనులు చేయకపోతే.. తల్లికి డబ్బులు కట్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాస్ట్ ఛాన్స్ ఇస్తుంది, వెంటనే ఏంటని తెలుసుకోండి..

ఆంధ్రప్రదేశ్ లో విద్యార్థులకు గుడ్ న్యూస్.. పిల్లల చదువులు తల్లిదండ్రులకు భారం కాకూడదని ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం తల్లికి వందనం ద్వారా ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసినదే. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూల్, కాలేజీలో చదువుకున్న ప్రతి విద్యార్థులకు తల్లికి వందనం అందిస్తుంది. పిల్లలను చదివించాలంటే సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారంగా కూడుకున్న పని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 15,000/- ఆర్థిక సహాయం అందిస్తుంది. గత సంవత్సరంలో జూన్ తల్లికి వందనం జమ చేశారు ఈ సంవత్సరం జూలై 16,17,18 వ తేదీలలో తల్లికి వందనం డైరెక్ట్ గా తల్లిలా ఖాతాల్లో జమ చేయనన్నారు. అయితే ఈ నిధులు పడాలంటే తప్పనిసరిగా కొన్ని పనులు చేయవలసి ప్రభుత్వం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందనం పథకం నిధులు విడుదలకు జూలై 16 నుంచి 18 తేదీ మధ్యలో తల్లికి వందనం నిధులు విడుదల చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్లలో & కాలేజీలలో చదివే విద్యార్థులకు 15,000 ఆర్థిక సాయం అందుతుంది. ఈ 15 వేలల్లో 2,000 రూపాయలు పాఠశాల నిర్వహణకు మినహాయిస్తే, మిగతా 13000 విద్యార్థుల తల్లి ఖాతాలో ప్రభుత్వం నేరుగా జమ చేస్తుంది. ఈ నగదు పొందాలంటే తల్లి ఖాతాకు సంవత్సరంలో ఒక్కసారైనా ఈ కేవైసీ అయి ఉండాలి. అలాగే బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. NPCI మ్యాపింగ్ కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇంకా ఐదు రోజులు మాత్రమే టైముంది కాబట్టి ఇప్పుడు వరకు అలా చేయకుండాట్లయితే వెంటనే ఈ-KYC, ఆధార్ లింక్ & NPCI మ్యాపింగ్ తప్పనిసరిగా చేపించండి. మరిన్ని వివరాల కోసం గ్రామ వార్డు సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ ఆఫీసర్ ను సంప్రదించండి.

తల్లికి వందనం అర్హత ఉందా? లేదా? అనేది ఈ https://bm-sgsw.ap.gov.in/BM/Schemeout లింకు పైన క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఈ పథకం కింద డబ్బులు అందాలంటే తప్పనిసరిగా ఆధార్ కు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి, అలాగే ఈ కేవైసీ పూర్తయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ కూడా యాక్టివ్ లో ఉండాలి. విద్యార్థులకు 75% హాజరు, జులై 15 లోపు తల్లుల బ్యాంకు ఖాతాకు ఈ కేవైసీ పూర్తి చేసి ఉండాలి. NPCI మ్యాపింగ్ అయి ఉండాలి. బ్యాక్ అకౌంట్ కి ఆధార్ కార్డు లింక్ అయి ఉండాలి. వారికి మాత్రమే నిధులు సకాలంలో జమవుతాయని అధికారులు స్పష్టం చేశారు.

