కొత్త గా 2 జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగాల జాతర.. 158 టీచర్, 274 సహాయకురాలి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ | Latest TS Anganwadi Recruitment 2026
Latest TS Anganwadi Recruitment 2026 Latest Adilabad & Kamareddy district Anganwadi teacher & helper notification 2026 : తెలంగాణలో మరో కొత్త జిల్లాలో నోటిఫికేషన్ వచ్చేసింది. కొత్త 7 జిల్లాలలో నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈరోజు కామారెడ్డి జిల్లాలో 95 అంగన్వాడీ టీచర్లు మరియు 95 అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే ఆదిలాబాద్ జిల్లాలో 63 అంగన్వాడీ టీచర్ & 179 అంగన్వాడి హెల్పర్ ఉద్యోగాలు ఖాళీలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగులకు 09 జూలై 2026 తేదీ నుంచి 20, 25 జూలై 2026 తేది వరకు https://mis.tgwdcw.in/ ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. రోజు మొత్తం రెండు జిల్లాలలో కలిపి 432 ఉద్యోగులు అయితే భర్తీ చేస్తున్నారు.

కామారెడ్డి జిల్లాలోని మహిళా, శిశు, దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ పరిధిలో గల ఐ.సి.డి.యస్ బాన్స్ వాడ .. దోమకొండ, కామారెడ్డి, మద్నూర్ మరియు ఎల్లారెడ్డి ప్రాజెక్టుల లో ఖాళీగా ఉన్న అంగన్ వాడి టీచర్లు మరియు గిరిజన ప్రాంతంలో అంగన్వాడి సహాయకురాలు పోస్టులు భర్తీ చేయడానికి అర్హులైన మహిళ అభ్యర్థినుల నుండి ఆన్ లైన్ దరఖాస్తులు కోరనైనది.
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 09/07/2026
•దరఖాస్తు చివరి తేది : 25/07/2026 వరకు సాయంత్రము 5.00 గంటల వరకు
•డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ తేదీ : 28.07.2026 నుండి 01.08.2026
అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఉండవలసిన అర్హతలు ఇవే
•తప్పనిసరిగా ఇంటర్ ఉత్తీర్ణులై ఉండవలయును. ఆయా (హెల్పర్) పోస్ట్ కు ఇంటర్ అభ్యర్థినులు లేని యెడల 10వ తరగతి ఉత్తీర్ణులైన వారిని ఎంపిక పరిగణలోకి తీసుకోబడును.
•వయస్సు: 01/07/2026 నాటికి 18 సంవత్సరములు నుండి 35 సంవత్సరములలోపు ఉండాలి.
•స్థానికత: దరఖాస్తు చేసుకోబోయే మహిళలు అంగన్వాడీ కేంద్రానికి తప్పనిసరిగా స్థానిక వాస్తవ్యులై ఉండాలి. గ్రామీణ ప్రాంతానికి సదరు గ్రామ పంచాయతీకి చెందిన వారు ఆయి ఉండాలి.
•ఎస్సీ/ఎస్టీ సబ్ ప్లాన్ కింద ఎస్సీలకు కేటాయించిన అంగన్ వాడీ టీచర్ మరియు అంగన్ వాడీ హెల్పర్ పోస్టులకు ఆది గ్రామపంచాయతీకి చెందిన ఎస్సీ అభ్యర్థులు మాత్రమే అర్హులు.
అభ్యర్ధుల ఎంపిక క్రింది ప్రమాణాల ఆధారంగా జరుగుతుంది: ఇంటర్మీడియట్ మార్కుల మెరిట్ 70 మార్కులు. ప్రత్యేక కేటగిరీలు : వితంతువులు-5 మార్కులు, ఆనాథలు -10 మార్కులు, దివ్యాంగులు-5 మార్కులు, జిల్లా ఎంపిక కమిటీ నిర్వహించే ఇంటర్వ్యూ 10 మార్కులు, దరఖస్తు http://wdcw.tg.nic.in వెబ్ సైట్ నందు మాత్రమే అప్లై చేయగలరు
ఆన్లైన్లో అప్లోడ్ చేయావలసిన ద్రువపత్రాలు (Scanned copies)
1. పుట్టిన తేది / వయస్సు దృవీకరణపత్రము (SSC certificate).
2. కుల దృవీకరణ పత్రము తహసిల్దార్ చే
3. విద్యార్హత దృవీకరణపత్రము, ఇంటర్/ ఆ పై విద్య అర్హతలు మార్కుల జాబితా,
4. నివాస దృవీకరణపత్రము తహసిల్దార్ చే
5. అంగవైకల్యం కలిగిన వారు సదరం సర్టిఫికెట్
6. వితంతువు అయితే భర్త మరణ దృవీకరణపత్రము.
7. ఆనాథ అయితే ఆనాద సర్టిఫికేట్.
8. వోటర్ ఐ.డి కార్డ్.
9. ఆధార్ కార్డ్.
•ముఖ్య గమనిక : దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు వారు దరఖాస్తు చేసుకున్న అంగన్ వాడీ కేంద్రము యొక్క సంబందిత ఐ.సి.డి.యస్ ప్రాజెక్టు కార్యాలయములో తేది: 28.07.2026 నుండి 01.08.2026 వరకు అన్ని కార్యాలయ పని వేళలలో ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు, attested (Gazetted) Xerox (2), attested (Self) Xerox (1) కాపీలతో పరిశీలనకు సమర్పించుకోవాలి. లేని యెడల వారి దరఖాస్తులను పరిగణనలోనికి తీసుకొనబడవు.
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 09/07/2026
•దరఖాస్తు చివరి తేది : 25/07/2026 వరకు సాయంత్రము 5.00 గంటల వరకు
•డాక్యుమెంట్ వెరిఫికేషన్ & ఇంటర్వ్యూ తేదీ : 28.07.2026 నుండి 01.08.2026

🛑Notification Pdf Click Here
🛑Vacancy & Roster Pdf Click Here
🛑OFFICIAL WEBSITE CLICK HERE
🛑 APPLY ONLINE LINK CLICK HERE

