No Fee : రాత పరీక్ష లేకుండా అంగన్వాడి పోషణ్ 2.0 లో డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest AP Anganwadi Poshan 2.0Notification 2026 Apply Now
AP Anganwadi Poshan 2.0 Recruitment 2026 Latest District Project Assistant Notification 2026 Apply Now: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ లో అంగన్వాడి పోషణ్ 2.0 నందు ఖాళీగాయున్న డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (DPA) కాంట్రాక్ట్ పద్ధతిన నోటిఫికేషన్ వచ్చేసింది.
ఆంధ్రప్రదేశ్, జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారత కార్యాలయము, నరసరావుపేట, పల్నాడు జిల్లా సాక్షం అంగన్వాడి పోషణ్ 2.0 నందు ఖాళీగాయున్న డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (DPA) కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేయుటకు గాను అర్హతగల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడమైనది. మేనేజ్‌మెంట్/సామాజిక శాస్త్రాలు/న్యూట్రిషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు, వయోపరిమితి 25 నుండి 42 సంవత్సరాలు. నెల జీతం రూ.35,000/- ఇస్తారు. నోటిఫికేషన్ ప్రచురించిన తేదీ నుండి 18.05.2026 సాయంత్రం 5.00 గంటల లోపు) అర్హత సాధించి షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే ఇంటర్వ్యూకు పిలుస్తారు మరియు ఎంపిక కోసం జాబితా చేయబడిన అభ్యర్థులను మాత్రమే పరిగణిస్తారు.

•పోస్ట్ వివరాలు
•డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ (DPA) ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.
•కనీస విద్య అర్హత :
•మేనేజ్‌మెంట్/సామాజిక శాస్త్రాలు/న్యూట్రిషన్‌లో గ్రాడ్యుయేట్ డిగ్రీ/పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా. ఐటీ సామర్థ్య పెంపులో కనీసం 2 సంవత్సరాల పని అనుభవం, పర్యవేక్షణ నైపుణ్యాలతో, స్థానిక భాషలో మంచి మౌఖిక మరియు లిఖిత రూప నైపుణ్యాలు మరియు ఆంగ్లంలో మోస్తరు నైపుణ్యాలు. బృందంగా పనిచేయగల సామర్థ్యం మరియు విస్తృతంగా ప్రయాణించడానికి సుముఖత. తప్పనిసరిగా స్థానిక అభ్యర్థులను నియమించాలి.

•వయస్సు :
•అన్ని పోస్టులకు వయోపరిమితి 25 నుండి 42 సంవత్సరాలు
•నెల జీతం :
• ఈ నోటిఫికేషన్ నెల జీతం ₹35,000/- ఇస్తారు.
•అప్లికేషన్ ఫీజులు :: ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు లేదు
•ఎంపిక ప్రక్రియ :: విద్య అర్హత మెరిట్ ఆధారంగా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
•ఎలా దరఖాస్తు చేయాలి : ఆసక్తి గల అభ్యర్ధులు డిస్టిక్ట్ వెబ్ సైటు (http://palnadu.ap.gov.in/) నుండి ధరఖాస్తు (Application form/CV) డౌన్ లోడ్ చేసుకొని టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (TOR) ప్రకారం పూర్చి చేసి అన్నీ దృవ పత్రాల నకలు జత చేసి ది: 11.05.2026 నుండి 18.05.2026 లోపల కార్యాలయ పని దినములలో (సాయంత్రం 5.00 గంటల లోపు ) జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికారిత అధికారి, చాకిరాల మిట్ట, బరంపేట, నరసరావుపేట, పల్నాడు జిల్లా, పిన్ కోడ్: 522601 వారికి సమర్పించవలెను.
ఆసక్తిగల అభ్యర్థులు నిర్దేశించిన దరఖాస్తు పత్రాన్ని డౌన్‌లోడ్ చేసుకొని, నింపిన దరఖాస్తు పత్రంతో పాటు విద్యార్హతలు, మార్కుల జాబితా, అనుభవ ధృవపత్రాలు, కంప్యూటర్లలో ధృవపత్రం, 10వ తరగతి వరకు చదువు ధృవపత్రాలు మొదలైన వాటి ధృవీకరించిన జిరాక్స్ కాపీలను జతచేసి సమర్పించవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ : 11 మే 2026
•ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ :: 18 మే 2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

