TS Inter Results 2025 | ఇంటర్మీడియట్ ఫలితాలు | జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం
TS Inter Results 2025 : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ & సెకండ్ ఇయర్ వార్షిక పరీక్షలు ముగిసిన నేపథ్యంలో, జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ మొదలైంది. పరీక్షల తర్వాత విద్యార్థులు ఎక్కువగా ఎదురుచూసేది ఫలితాలే. ఈసారి ఇంటర్ ఫలితాలు ఎప్పుడొస్తాయి? అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? అనే అంశాలను ఈ వ్యాసంలో తెలుసుకుందాం.
జవాబు పత్రాల మూల్యాంకనం వివరాలు
ఇంటర్మీడియట్ పరీక్షల అనంతరం, జవాబు పత్రాల మూల్యాంకనం చాలా కీలక దశ. 2025 సంవత్సరానికి సంబంధించి మార్చి 19 నుండి మూల్యాంకనం ప్రారంభమైంది. తెలంగాణ ఇంటర్‌బోర్డు అధికారిక సమాచారం ప్రకారం, ఏప్రిల్ 10, 2025 నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని అంచనా.
Telangana Inter Results 2025

మూల్యాంకన కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు
ఈ ఏడాది 19 మూల్యాంకన కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఒక్కో కేంద్రంలో 600 నుండి 1200 మంది అధ్యాపకులు మూల్యాంకన విధుల్లో పాల్గొంటారు. తొలిసారిగా ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ హాజరు విధానం అమలు చేస్తున్నారు. BIE యాప్ ద్వారా వేలిముద్రలు లేదా ఫేసియల్ రికగ్నిషన్ ద్వారా హాజరు నమోదు చేస్తున్నారు. అన్ని కేంద్రాలను కమాండ్ కంట్రోల్ కేంద్రానికి అనుసంధానం చేసి పర్యవేక్షణ పెంచారు. సెల్‌ఫోన్ ఉపయోగంపై కట్టుదిట్టమైన నిబంధనలు అమలు చేస్తున్నారు.
తెలంగాణ ఇంటర్ ఫలితాలు ఎప్పుడెప్పుడూ?
ఇంటర్ ఫలితాలు సాధారణంగా ఏప్రిల్ మూడో వారంలో విడుదల అవుతాయి. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 20, 2025 తర్వాత ఫలితాలను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉన్నందున, ఫలితాల విడుదలకు ఎన్నికల సంఘం అనుమతి అవసరం. అందువల్ల, అధికారిక ప్రకటన వెలువడే వరకు విద్యార్థులు వెయిట్ చేయాలి.
ఫలితాల అధికారిక వెబ్‌సైట్ : ఫలితాలను తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారిక వెబ్‌సైట్ tsbie.cgg.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు.

ఇంటర్ ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి?
Step 1: మొబైల్ / కంప్యూటర్ ద్వారా tsbie.cgg.gov.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి.
Step 2: “TS Inter Results 2025” అనే లింక్‌పై క్లిక్ చేయాలి.
Step 3: మీ హాల్ టికెట్ నంబర్‌ను ఎంటర్ & DOB ENTER చేసి, “Submit” బటన్ చేయండి.
Step 4: ఫలితాలు స్క్రీన్‌పై వస్తాయి.
Step 5: మీ ఫలితాలను Pdf డౌన్‌లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకోవచ్చు.
🔥AP Out Sourcing Jobs : 10th అర్హతతో క్లర్క్ & సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగ భర్తీ నోటిఫికేషన్ విడుదల