కొత్త పెన్షన్లపై BIG UPDATE.. ఆసరాపెన్షన్ దరఖాస్తులో కొత్త మార్పులు.. అర్హతలివే | TS Aasara Pension 2026
Applications for Telangana Aasara Pension 2026 apply by 31st of this month : తెలంగాణలో కొత్త పెన్షన్ దారులకు నిరంతరం ప్రక్రియ అని ఇటీవల ప్రకటించిన ప్రభుత్వం మళ్ళీ ఆంక్షలు విధించారు. ఈనెల 31 లోపు అప్లై చేసుకోవాలని ప్రకటించారు. ఇందులో తొలి దశలో ముఖ్యంగా ఒంటరి మహిళలు, దివాంగులు, వితంతువులు, చేనేత గీత కార్మికులు, తులసీమియా, ఫైలేరియా & సికిల్ సెల్ వ్యాధిగ్రస్తులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. దరఖాస్తులను క్షేత్రయ్య స్థాయిలో పరిశీలించిన తర్వాత పెన్షన్ మంజూరు చేస్తామని తెలిపారు. ఆ తర్వాత మళ్లీ దరఖాస్తు అవకాశం ఇవ్వనట్లు సమాచారం.

ఆసరా పెన్షన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ముఖ్యంగా పంచాయతీ కార్యదర్శి, MPDO ఆఫీసులో వెంటనే అప్లై చేసుకోవాలని తెలిపారు. గతంలో దరఖాస్తు చేసిన వారు మళ్లీ దరఖాస్తు చేసుకున్న అవసరం లేదు. తెలంగాణలో పెన్షన్ దారులకు అర్హత వివరాలు చూసుకున్నట్లయితే.. వితంతువులకు 18 సంవత్సరాల వయసు నుండి భర్త డెత్ సర్టిఫికెట్, ఒంటరి మహిళలు 18 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండి భర్త వదిలేసి ఉండాలి. 30-35 ఏళ్ల కంటే ఎక్కువ అవివాహితులు కూడా అర్హులే. దివాంగులకు వయసుతో సంబంధం లేకుండా సదన్ సర్టిఫికెట్లు 40% కంటే ఎక్కువ ఉన్నట్లయితే వికలాంగుల పెన్షన్ అప్లై చేసుకోవచ్చు. చేనేత గీత కార్మికులు, తులసీమియా, ఫైలేరియా & సికిల్ సెల్ బాధితులు కూడా అప్లై చేసుకోవచ్చు.
కొత్త పెన్షన్ కోసం ప్రభుత్వం అనర్హుల జాబితాను విడుదల చేసింది. అందులో ముఖ్యంగా గ్రామాలలో రూ. 1.50 లక్షలు పట్టణాలలో రూ. 2 లక్షలు వార్షిక ఆదాయం నుంచి అనర్హులు. 3 ఎకరాల కన్నా మించి మాగాన్ని 7.5 ఎకరాల కన్నా మించి మిట్ట భూమి ఉన్నట్లయితే అనర్హులు, అలాగే ప్రభుత్వ ప్రైవేటు అవుట్సోర్సింగ్ కాంటాక్ట్ ఉద్యోగాలు చేసే పిల్లలు ఉంటే వాళ్ళందరూ కూడా అనర్హులే. రైస్ మిల్లులు పెట్రోల్ పంపులు ఫోర్ వీలర్ ఉంటే వాళ్లు కూడా అనర్హులే. ఇప్పటికే ఏదైనా పెన్షన్ తీసుకున్న వారు కొత్త పెన్షన్ కి అనర్హులే.

ఆసరా పెన్షన్ కోసం ఈనెల 31 వరకు మాత్రమే టైం ఉంది కాబట్టి వెంటనే పంచాయతీ కార్యదర్శి లేదా MPDO కార్యాలయంలో వెంటనే అప్లై చేసుకోండి.

