Talliki Vandanam Scheme : ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన.. ఈనెల 7 వరకు ఛాన్స్.. ఈ చిన్న పని చేస్తే సరిపోతుంది
Andhra Pradesh Talliki Vandanam Scheme 2026 Not Received Gives Clarity: ఆంధ్రప్రదేశ్ లో తల్లికి వందన 13,000 స్కీమ్ అందని వారికి ప్రభుత్వం మరొక గుడ్ న్యూస్ తెలిపింది. అభ్యంతరాల, ఫిర్యాదులు స్వీకరణ గడువు ఈనెల 3 తో ముగియంగా దానిని ఈ నెల 7 వరకు పొడిగించింది. అర్హుల జాబితాలో పేరు లేకపోతే ఆ తేదీలోపు స్వర్ణ, గ్రామ వార్డు సచివాలయంలో వెంటనే సంప్రదించాలని సూచించారు. అలాగే తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. బ్యాంకు ఖాతాకి NPCI లింక్ అయి ఉండాలి. ప్రభుత్వం ఫిర్యాదులన్నీ పరిశీలించిన తర్వాత ఈనెల 30 తేదీన డబ్బులు డైరెక్ట్ గా తల్లుల అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది.

తల్లికి వందనం అర్హత కలిగి ఉండి ఆర్థిక సహాయం అందని తల్లులు ఆగస్టు 7 లోపున దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. గ్రామ లేదా వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్ ఫిర్యాదు చేసుకోవాలని తెలిపారు. ముందుగా బ్యాంకు అకౌంటు సమస్యలు, ఆధార్ లింకు లోపాలు, ఈ కెవిసి పూర్తి చేశారా లేదా వంటి కారణాలు నగదు జమ కాని వారు వెంటనే సచివాలయం ని సంప్రదించాలని తెలిపారు. సచివాలయానికి వెళ్లే సమయంలో తల్లి ఆధార్ కార్డు, విద్యార్థి ఆధార్ కార్డు, కుటుంబ రేషన్ కార్డు & బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ వంటివి తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఆలస్యం చేయకుండా వెంటనే వెల్ఫేర్ అసిస్టెంట్ కలిసి నట్లయితే వాళ్లు ప్రాబ్లం ఏంటి అనేది చెక్ చేస్తారు. డబ్బులు పడనివారు ఆందోళన చెందకుండా ప్రత్యేక గ్రీవెన్స్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. తద్వారా అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది.
2026 – 27 సంవత్సరంలో కొత్తగా పాఠశాల ప్రవేశాలు పొందిన లేదా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అడ్మిషన్ అవ్వడానికి ఆగస్టు 25 వరకు మాత్రమే గడువు ఇచ్చారు. ఆగస్టు 8 నుంచి ఆగస్టు 13 వరకు దరఖాస్తులను పరిశీలిస్తారు. ఆ తర్వాత విద్యాశాఖ ఉద్యోగ సహాయంతో అర్హత జాబితా సిద్ధం చేస్తారు. నిబంధన ప్రకారం అర్హత కలిగిన ఆన్లైన్ పోర్టల్ నమోదు చేస్తారు, అర్హత ఉండి మెరిట్ జాబితా ఆగస్టు 30న విడుదల చేస్తారు, అదే రోజు ₹13,000/- నగదు కూడా జమ చేస్తారు. ముఖ్యంగా బ్యాంకు ఖాతా ఆధార్ కార్డు కి లింక్ అయిందా లేదా NPCI మ్యాపింగ్ అయిందా లేదా బ్యాంకుకు వెళ్లేసి ఒకసారి చెక్ చేసుకోండి. ఎటువంటి సాంకేతిక సమస్యలు రాకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి తల్లికి వందనం వచ్చేలా అధికారులు చర్యలు వేగవంతంగా తీసుకుంటున్నారు.


